Sunita Williams
Sunita Williams: 2024, జూన్ 5 బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్(Buch Vilmore)అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు బయలుదేరారు. అసలు ప్లాన్ ప్రకారం ఈ మిషన్ కేవలం 8 రోజులు మాత్రమే ఉండాల్సి ఉండగా, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు (థ్రస్టర్ లోపాలు మరియు హీలియం లీక్‌లు) కారణంగా వారి రిటర్న్ ఆలస్యమైంది. ఈ సమస్యల వల్ల స్టార్‌లైనర్(Star Liner)సెప్టెంబర్ 2024లో వారు లేకుండానే భూమికి తిరిగి వచ్చింది. దీంతో వారిని తీసుకురావడానికి నాసా తర్వాత స్పేస్‌ఎక్స్ క్రూ–9 మిషన్‌ను ఆగస్టు 2024లో ప్రారంభించింది, ఇందులో నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెక్సాండర్ గోర్బునోవ్ ఉన్నారు. ఈ మిషన్‌లో సునీతా, విల్మోర్‌ల కోసం రెండు సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. వీరు స్పేస్‌ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా 2025 మార్చి 19న భూమికి తిరిగి రానున్నారు. నాసా ప్రకారం, ఈ రిటర్న్ ఫ్లైట్ ఫ్లోరిడా తీరంలో సముద్రంలో ల్యాండ్ అవుతుంది, అమెరికా సమయం ప్రకారం మంగళవారం (మార్చి 18, 2025) సాయంత్రం 5:57PM EDT (భారత కాలమానం ప్రకారం మార్చి 19 ఉదయం 3:27 AM IST)కి షెడ్యూల్ చేయబడింది.
9 నెలలు అంతరిక్షంలో..
ఈ 9 నెలల కాలంలో సునీత, విల్మోర్ అంతరిక్షంలోనే ఉన్నారు. ఐఎస్‌ఎస్‌లోలో శాస్త్రీయ పరిశోధనలు, నిర్వహణ పనులు చేశారు. సునీతా విలియమ్స్ రెండోసారి ISS కమాండర్‌గా కూడా వ్యవహరించారు. భూమికి చేరిన తర్వాత, సుదీర్ఘ అంతరిక్ష వాసం వల్ల వీరి శరీరాలు గురుత్వాకర్షణకు అలవాటు పడేందుకు కొంత సమయం పట్టవచ్చని, వైద్య పరీక్షలు, రిహాబిలిటేషన్ అవసరమని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీరి ధైర్యం, సహనాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.