Grok
Grok: సోషల్ మీడియా లో మన యువత ఎక్కువగా ఉపయోగించేది ‘ట్విట్టర్'(Twitter)..ఇప్పడు అది ‘X’ గా రూపాంతరం చెందింది. ట్విట్టర్ లో ఏ చిన్న వార్త బయటకు వచ్చినా అది వైల్డ్ ఫైర్ లాగా నిమిషాల వ్యవధిలో ప్రపంచమంతా వ్యాప్తి చెందుతుంది. అంతే కాదు ట్విట్టర్ నుండి వచ్చే ప్రతీ వార్త చాలా రియాలిటీ కి దగ్గరగా ఉంటుంది. అందుకే సినీ సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులూ, వ్యాపారవేత్తలు కూడా ట్విట్టర్ ని అధికంగా వినియోగిస్తూ ఉంటారు. ఇక సినిమా అభిమానులు అయితే 24 గంటలు ట్విట్టర్ లోనే కాలం గడిపేస్తూ ఉంటారు. ట్విట్టర్ ఇచ్చినంత ఎంటర్టైన్మెంట్ ఏ సోషల్ మీడియా మాధ్యమం కూడా ఇవ్వలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ట్విట్టర్ లో సినీ హీరోల అభిమానులు ఏ రేంజ్ లో కొట్లాడుకుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ విషయంలోనే ఎక్కువగా గొడవలు ఉంటాయి.
Also Read: దేవుడికి, సైన్స్, గణితానికి ఏంటి సంబంధం.. హార్వర్డ్ పరిశోధనలో ఏం తేలింది?
అలాంటి ట్విట్టర్ లో ఇప్పుడు ‘గ్రోక్'(Grok) అనే సరికొత్త ఫీచర్ వచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) ద్వారా క్రియేట్ చేసిన ఈ ఫీచర్, ఒక రోబో లాంటిది అన్నమాట. దీనితో మన నెటిజెన్స్ తెగ ఆడుకుంటున్నారు. గ్రోక్ ని ట్యాగ్ చేసి ఒక హీరో గురించి చెప్పమని అడగగా, ఆ హీరో కి సంబంధించిన చరిత్ర మొత్తం చెప్పేస్తుంది. అంతే కాదు ఇది హీరోలను ట్రోల్స్ కూడా చేయడం గమనార్హం. సోషల్ మీడియా లో ఉన్నటువంటి డేటా ని ఆధారంగా తీసుకొని ఈ ఫీచర్ ని తయారు చేసారు. కొంతమంది అయితే గ్రోక్ ని ట్యాగ్ చేసి తిట్టగా, అది కూడా రివర్స్ లో బండ బూతులు తిడుతుంది. అందరి హీరోల గురించి ఎక్కువగా నెగటివ్స్ చెప్పిన గ్రోక్, కేవలం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), ఎన్టీఆర్ (Junior NTR) విషయం లో మాత్రం అత్యధికంగా పాజిటివ్స్ చెప్పింది. ఫ్యాన్ బేస్ విషయంలో వీళ్లిద్దరి తర్వాతే ఎవరైనా అనే అర్థం వచ్చేలా అనేక కామెంట్స్ చేసింది గ్రోక్.