Homeవింతలు-విశేషాలుSpace Events In 2026: ఈ ఏడాది ఆకాశంలో ఐదు అద్భుతాలు.. కచ్చితంగా చూడాల్సిందే...

Space Events In 2026: ఈ ఏడాది ఆకాశంలో ఐదు అద్భుతాలు.. కచ్చితంగా చూడాల్సిందే…

Space Events In 2026: విశాలమైన నింగి ఎన్నో అద్భుతాలకు నిలయం. మనం పరీక్ష పెట్టి చూడాలే గాని ప్రతిక్షణం కూడా అందులో ఆశ్చర్యం కనిపిస్తుంది. ఈ ఏడాది ఆకాశంలో ఏకంగా ఐదు అద్భుతాలు చోటు చేసుకుంటాయట. వాటిని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో కనుగొని.. ఈ ఏడాదిలో ఎటువంటి అద్భుతాలు చోటు చేసుకుంటాయో స్పష్టంగా చెప్పేశారు. ఇంతకీ ఆ వింతలు ఏంటంటే…

ఈ ఏడాది ప్రారంభంలోనే quandra tids ఉల్కా పాతం ఆకాశంలో చోటు చేసుకుంటుంది. జనవరి మూడు నుంచి నాలుగో తేదీ వరకు ఈ ఉల్కాపాతం చోటు చేసుకుంటుంది. అనుకూలమైన వాతావరణంలో 100 షూటింగ్ స్టార్లు దర్శనమిస్తాయట. కేవలం గంట వ్యవధిలోనే ఇలా జరుగుతుందట. ఉత్తర భారత దేశంలో జనవరి 3 నుంచి 4 తేదీల మధ్యలో సూర్యోదయం ముందు సమయంలో ఉత్తరం, తూర్పు దిశల మధ్యలో చూస్తే ఈ ఉల్కా పాతం దర్శనమిస్తుంది..

ఈ ఏడాది జనవరి 3న తొలి పౌర్ణమి సూపర్ మూన్ మాదిరిగా దర్శనమిస్తుంది. దీనిని ఎలుగుబంటి చంద్రుడు అని శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. పౌర్ణమి సమయంలో చంద్రుడు వెలిగిపోతుంటాడు. సాధారణ పున్నమి సమయాన్ని కంటే ఎంతో ప్రకాశవంతంగా.. పరిమాణంలో పెద్దగా ఈ ఎలుగుబంటి చంద్రుడు కనిపిస్తాడు. మన దేశంలోని అన్ని ప్రాంతాలలో ఈ అద్భుతాన్ని చూడవచ్చు.

జనవరి 10న జూపిటర్ గ్రహం భూమికి అత్యంత దగ్గరగా వస్తూ ఉంటుంది. ఒక నక్షత్రం లాగా గురు గ్రహం దర్శనమిస్తూ ఉంటుంది. సూర్యాస్తమయం నుంచి తెల్లవారుజాము వరకు కూడా ఈ గ్రహం దర్శనమిస్తూ ఉంటుంది. బైనాక్యులర్ సహాయంతో ఈ అద్భుతాన్ని చూడవచ్చు.

జనవరి నెలలో ఆకాశంలో మూడు అద్భుతాలు చోటు చేసుకుంటాయని చెప్పుకున్నాం కదా.. ఆ తర్వాత కొద్దిరోజులు గ్యాప్ వస్తుంది. అనంతరం ఆగస్టు 12న గ్రీన్ ల్యాండ్, ఐస్ ల్యాండ్, ఉత్తర స్పెయిన్ ప్రాంతాలలో అంతట సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉంటుంది. అంటే పగటిపుటి రాత్రి వస్తుందన్నమాట. అయితే మన దేశం నుంచి ఈ గ్రహణం పూర్తిగా కల్పించదు. అయితే కొన్ని ప్రాంతాలలో మాత్రం స్వల్పంగా మసకబారిన సూర్యుడు దర్శనమిస్తాడు. ఉత్తర భారత దేశంలో ఈ పరిస్థితి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆగస్టు తర్వాత మళ్లీ డిసెంబర్ 23న కోల్డ్ మూన్ పేరుతో అతిపెద్ద చంద్రుడు ఆకాశంలో ఆవిష్కృతమవుతాడు. 2019 అనంతరం భూమికి అత్యంత దగ్గరగా చంద్రుడు రావడం వల్ల ఇటువంటి అద్భుతం చోటు చేసుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ తర్వాత ఆకాశంలో చంద్రుడు ఆ రోజున విపరీతమైన ప్రకాశవంతంగా కనిపిస్తాడని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular