OPPO Reno 15 Series Features: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తోంది. మారిన సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా కంపెనీలు ఫోన్లను తయారు చేస్తున్నాయి. అద్భుతమైన సౌకర్యాలను.. అధునాతనమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇందులో ఒప్పో కంపెనీ కూడా అద్భుతమైన మోడల్ ఒకటి తీసుకొచ్చింది. తన కంపెనీ ఉత్పత్తులను ప్రేమించే వారికోసం.. అద్భుతమైన ఫీచర్లను.. అది కూడా పాకెట్ ఫ్రెండ్లీలోనే తీసుకురావడం విశేషం.
Oppo కంపెనీ రెనో సిరీస్ లో ఎన్నో ఫోన్లను తీసుకొచ్చింది. ఈసారి రెనో సిరీస్ లోనే Reno 15, Reno 15 pro, Reno 15 pro Max అనే మోడల్లను రిలీజ్ చేసింది. ఇవన్నీ కూడా 120 Hz రీ ఫ్రెష్ రేట్ కలిగి ఉన్నాయి.. అంతేకాదు AMOLED డిస్ ప్లే తో కనిపిస్తున్నాయి.. ఈ మోడల్ ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ 16 ను సపోర్ట్ చేస్తున్నాయి. ఈ మోడళ్ల కు IP 69 రేటింగ్ ఉంది. అన్ని మోడల్స్ లో కూడా 50 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా ఒప్పో కంపెనీ ఈ మోడల్స్ రూపొందించింది. అంతేకాదు, వీటిల్లో అద్భుతమైన ఫీచర్స్ రూపొందించింది.. ఒప్పో ప్రో మాక్స్ ఫోన్ గనక తీసుకుంటే.. ఇందులో 6.78 ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంది. రిఫ్రిజిరేట్ 120 హెచ్ జెడ్ వరకు ఉంది. 450 పిపి పిక్సెల్ డెన్సిటీతో ఇది వస్తోంది. ఇందులో మీడియా టెక్ డైమండ్స్ టి 8450 ప్రాసెసర్ ఉంది. 12 జిబి రామ్, 512 జిబి స్టోరేజ్ ఉంది. కెమెరా విభాగంలో 200 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సార్ , 50 ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్ ఇందులో ఉన్నాయి. ముద్దు భాగం లో 50 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. 6500 ఎం ఏ హెచ్ బ్యాటరీ తో పాటు 80 డబ్ల్యూ వైర్డ్, 50 w వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
ఒప్పో రెనో 15 ప్రో మాక్స్ ధర TWD 24,990(71000). ఇది 12gb ర్యామ్, 512 జిబి స్టోరేజ్ వేరియెంట్లో లభిస్తుంది. రెనో 15 ప్రో ధర TWD 20,990 (₹60,000).. ఇది 12gb రామ్, 256 జిబి స్టోరేజ్ వేరియంట్ లో లభిస్తుంది. ఇందులోనే 12gb ర్యామ్, 256 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 17,990 TWD (51,000) ధరలో లభిస్తుంది
.. ఇక ఇందులోనే 12gb+ 512 జిబి వేరియంట్ TWD 19,990(55,000) కు లభిస్తోంది.