Xiaomi Phones: చైనా కంపెనీ Xiaomi భారత్లో తన ఉత్పత్తులను రిలీజ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు టెక్నాలజీని డెవలప్ చేస్తూ.. కొత్త ఫీచర్లను చేరుస్తూ మార్కెట్లో రిలీజ్ చేస్తుంది. అయితే ఈ కంపెనీకి చెందిన 17, అల్ట్రా17 మొబైల్స్ ను భారత దేశంలో విడుదల చేయడానికి ఆమోదం పొందాయి. అయితే ఈ మొబైల్స్ 2026 జనవరి లేదా ఫిబ్రవరిలో వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటివరకు ప్రకటించారు. కానీ ఇవి మార్కెట్లోకి రావడానికి మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో Xiaomi లవర్స్ కు షాక్ ఇచ్చినట్లు అయింది. అయితే ఈ ఫోన్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపుతున్నారు. వినియోగదారులకు అనుగుణంగా కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్ వంటి వాటిని నేటి వారికి అనుగుణంగా ఇందులో పొందుపరిచారని తెలుస్తోంది. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఈ రెండు మొబైల్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Xiaomi మొబైల్స్ ఇప్పటికే అందరికీ సుపరిచితం. ఈ కంపెనీకి చెందిన మొబైల్ చాలామంది వినియోగిస్తున్నారు. వీటికి మార్కెట్లో ఎక్కువగా ఆదరణ ఉండడంతో ఈ కంపెనీ నుంచి అప్గ్రేట్ చేసిన మొబైల్స్ మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా Xiaomi 17 మొబైల్ ఫీచర్ విషయానికి వస్తే.. 12gb రామ్ నువ్వు అమర్చారు. అలాగే 256 స్టోరేజ్ కూడా ఉండనుంది. దీంతో మల్టీ టాస్కింగ్ యూస్ చేసే వారికి ఈ ఫోన్ సపోర్ట్ గా ఉండనుంది. అలాగే కావలసినంత ఫైల్స్ ను స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత కాలంలో రకరకాల ఫైల్స్ మొబైల్స్ లోని స్టోర్ చేసుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం ఈ మెమొరీ సరిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఈ మొబైల్ 6.3 అంగుళాల 1.5 K OLED డిస్ప్లే ఉండనుంది. నాణ్యమైన వీడియోలతో పాటు.. గేమింగ్ కోరుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది. ఈ డిస్ప్లే 120 Hz రిఫ్రిస్ రేట్ తో పనిచేయడం వల్ల యూత్ కు బాగా నచ్చుతుంది. ఇది 3500 బిట్స్ గరిష్ట బ్రైట్నెస్తో ఆకట్టుకుంటుంది. అయితే జనవరి లేదా ఫిబ్రవరిలో రావాల్సిన ఈ మొబైల్ సెప్టెంబర్ కు వాయిదా పడ్డట్లు తెలుస్తోంది.
Xiaomi 17 ఆల్ట్రా మొబైల్ ఫీచర్స్ 12gb రామ్, 512 GB స్టోరేజ్ ఉండడంతో ఇది కూడా మల్టీ టాస్కింగ్ యూస్ చేసే వారికి సపోర్ట్ గా ఉండనుంది. అయితే ఈ మొబైల్ 16 జిబి రామ్, 1TB వరకు స్టోరేజ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ 6.9 అంగుళాల 1.5 K AMOLED డిస్ప్లే తో పనిచేస్తుంది. అలాగే ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉండడంతో 1060 nits వరకు గరిష్ట బ్రైట్ లిస్టును కలిగి ఉంటుంది.
Xiaomi 17 మొబైల్ మార్కెట్లోకి వస్తే దీని బెస్ట్ వేరియంట్ CNY రూ.56,000 తో విక్రయించే అవకాశం ఉంది. అలాగే Xiaomi కానీ రూ.90,000 లతో విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది.