Technology News : నెటిజన్లు వీటిని ఎక్కువగా చూశారు.. ఇంతకీ వెబ్ సైట్లు ఏంటంటే..

స్మార్ట్ ఫోన్ అనేది మన చేతిని పూర్తిగా ఆక్రమించిన తర్వాత.. మన కళ్ళు ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ కే అంకితం అవుతున్నాయి. ఇంటర్నెట్ కూడా చవక ధరలో లభిస్తున్న నేపథ్యంలో చాలామంది రకరకాల వెబ్ సైట్లు చూస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 13, 2024 11:47 am

Technology news

Follow us on

Technology News : సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత.. మరింత జ్ఞానం కోసం లేదా సమాచారం కోసం వెబ్ సైట్ ల మీద ఆధారపడటం పెరిగిపోయింది. ఇది సమయంలో తెలియని విషయాల గురించి గూగుల్లో శోధించడం పెరిగిపోయింది. అయితే నెటిజన్లు ఇంటర్నెట్లో తెగ వెతుకుతున్న వాటి జాబితాను సెమిలర్ వెబ్ అనే సంస్థ వెల్లడిస్తుంది. అయితే గత నెలకు సంబంధించిన జాబితాని కూడా ఆ సంస్థ విడుదల చేసింది. ఇందులో తొలి స్థానంలో గూగుల్ ఉంది.. రెండో స్థానంలో యూట్యూబ్ నిలిచింది. ఆ తర్వాతి స్థానాలలో ఓ పెద్దల సైట్, ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ వంటివి ఉన్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా 83.5 బిలియన్ విజిట్స్ తో గూగుల్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత స్థానంలో యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ఎక్స్. కామ్, వాట్సాప్ వంటివి ఉన్నాయి. కోవిడ్ తర్వాత ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. కేవలం భారత్ లో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది. పైగా సోషల్ మీడియా పెరిగిపోవడంతో చాలామంది స్మార్ట్ ఫోన్ కు అతుక్కుపోతున్నారు.

అయితే చాలామంది వెబ్ సైట్లను వెతికేది సమాచారం కోసమేనని సెమిలర్ వెబ్ సంస్థ వెల్లడించిన నివేదిక ద్వారా తెలుస్తోంది. వాస్తవానికి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రజలు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగానే గూగుల్ వంటి సైట్ లలో వివిధ అంశాలను తెగ శోధిస్తున్నారు.. అయితే సెర్చింగ్ ఇంజన్లో గూగుల్ నెంబర్ వన్ గా ఉంది కాబట్టి.. ఆ సంస్థకు ఎక్కువ విజిట్స్ దక్కాయి. గతంలోనూ గూగుల్ సంస్థ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఈసారి అనూహ్యంగా పెద్దల చిత్రాలను ప్రదర్శించే వెబ్ సైట్లు తక్కువ విజిట్స్ సొంతం చేసుకోవడం విశేషం. అయితే కొంతమంది డార్క్ వెబ్లో పెద్దల చిత్రాల సైట్ లను చూస్తుంటారని.. అవి లెక్కలోకి రావని
సెమిలర్ వెబ్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ గతంతో పోలిస్తే ఇంటర్నెట్ వాడకం పెరిగిందని, న్యూస్, సినిమా.. ఇతర వెబ్ సైట్లను చూడడం పెరిగిందని సాంకేతిక నిపుణులు అంటున్నారు. ఒకపటిలాగా సమాచారం కోసం ఎదురుచూసే ఓపిక ప్రజలకు తగ్గిపోయిందని.. ఈ క్షణం ఏం జరుగుతుందో తెలుసుకోవడం వారికి ముఖ్యమైపోయిందని.. అందువల్లే వారు నెట్ లో ప్రతి అంశాన్ని తెగ శోధిస్తున్నారని ఈ సందర్భంగా సాంకేతిక నిపుణులు అంటున్నారు. అయితే ఇందులో సామాజిక మాధ్యమాలు మొదటి స్థానాలను ఆక్రమించుకోవడం విశేషం.