Samsung Galaxy F13: హైదరాబాద్ ,జూన్, 2022: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సాంసంగ్, గెలాక్సీ F13ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. Galaxy F సిరీస్‌లోని సరికొత్త ఫీచర్స్ తో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా న్యూ ఫీచర్స్ తోపాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో దీనిని రూపొందించారు. “సరికొత్త ఆవిష్కరణలను తీసుకువచ్చే సాంసంగ్ వారసత్వాన్ని కొనసాగిస్తూ, అంతరాయం లేని వినోదం కోసం సరికొత్త గెలాక్సీ ఎఫ్13ని లాంచ్ చేయడం పట్ల మేము సంతోషిస్తున్నాము. ఈ స్టైలిష్డివైస్Gen MZ అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి రూపొందించారు. Galaxy F13లో పూర్తి HD+ డిస్‌ప్లేతో కూడిన వ్యూవింగ్ ఎక్స్ పీరియన్స్ , భారీ 6000mAh బ్యాటరీ, అంతరాయం లేని కనెక్టివిటీ కోసం సెగ్మెంట్-ఫస్ట్ ఆటో డేటా స్విచింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి” అని సాంసంగ్ ఇండియా ప్రొడక్ట్ మార్కెటింగ్, సీనియర్ డైరెక్టర్ హెడ్ ఆదిత్య బబ్బర్ తెలిపారు.

పవర్-అప్
Galaxy F13 భారీ 6000mAh బ్యాటరీ (15W అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో), అడాప్టివ్ పవర్-పొదుపు AI పవర్ మేనేజ్‌మెంట్‌తో అందించడంతో ఇవి ఫోన్‌కు రోజంతా ఉండేలా పవర్ ని అందిస్తాయి. Galaxy F13 పరిశ్రమ-మొదటి ఆటో డేటా స్విచింగ్ ఫీచర్‌తో సీమ్ లెస్ కనెక్టివిటీని అందిస్తుంది, ఇది ప్రైమరీ SIM నెట్‌వర్క్ లేని ప్రాంతంలో ఉంటే ఆటోమేటిక్‌గా సెకండ్ SIMకి మారుతుంది. Galaxy F13 దాని 16.62cm FHD+ డిస్‌ప్లే ఇది సినిమాటిక్ అనుభవంతో స్పష్టమైన కంటెంట్‌ను కోరుకునే వారికి ఇది సరైనది.

మల్టీ టాస్క్
ఆక్టా-కోర్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌తో ఆధారితమైన, గెలాక్సీ ఎఫ్13 గేమింగ్, యాప్ నావిగేషన్ మరియు మల్టీ టాస్కింగ్ చేసే ర్యామ్ ప్లస్ ఫీచర్‌తో గరిష్టంగా 8GB RAMతో మెరుగైన పనితీరును అందిస్తుంది. బాహ్య మెమరీ కార్డ్‌తో నిల్వను 1TB వరకు విస్తరించవచ్చు. అత్యుత్తమ ఫోటోగ్రఫీ అనుభవాలని అందిస్తూ, Galaxy F13 మీ జీవితంలోని అత్యుత్తమ వివరాలను క్యాప్చర్ చేయడానికి 50MP ట్రిపుల్ వెనుక కెమెరాను కలిగి ఉంది. 123-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో ఉన్న అల్ట్రా-వైడ్ కెమెరా, డెప్త్ కెమెరా అత్యుత్తమ షాట్‌లను క్యాప్చర్ చేయడానికి కలిసి పని చేస్తాయి. Galaxy F13 కూడా 8MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.
Also Read: Naga Chaithanya Thankyou Movie: నాగచైతన్యకు ఆ అగ్ర నిర్మాత అన్యాయం?
ధర ఎంతంటే..?
వాటర్‌ఫాల్ బ్లూ, సన్‌రైజ్ కాపర్ అండ్ నైట్‌స్కీ గ్రీన్ రంగులలో లభిస్తుంది, Galaxy F13 సేల్స్ జూన్ 29న Samsung.com, Flipkart.com లో ప్రారంభంకానున్నాయి. ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో అందుబాటు లో ఉంటాయి. Galaxy F13 ధర 4GB+64 GB వేరియంట్‌కు రూ.11999 ,4GB+128GB వేరియంట్‌కు రూ.12999. ICICI బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించే వినియోగదారులు రూ.1000 అదనపు తగ్గింపును పొందవచ్చు.

Also Read: Senior Hero Naresh: నేనేనా ఎవరూ మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకోలేదా… ఫైనల్ గా నోరువిప్పిన నరేష్