Samsung Galaxy M35 5G: ప్రముఖ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ బుధవారం భారతదేశంలో మిడ్ సెగ్మెంట్ కొనుగోలుదారుల కోసం ఎక్సినోస్ ప్రాసెసర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణను కలిగి ఉన్న గెలాక్సీ M35 5G (Samsung Galaxy M35 5G)ని లాంచ్ చేసింది. భారతీయులు ఇలాంటి ఫోన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అత్యాధునిక ఫీచర్లు, నేటి టెక్-అవగాహన ఉన్న వినియోగదారుల డిమాండ్లకు అనుగుణంగా ఈ ఫోన్ రూపొందింది.
స్పెసిఫికేషన్లు
6.6 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉన్న Galaxy M35 5G దాని పూర్తి HD+ రిజల్యూషన్, ఆకట్టుకునే 120Hz రిఫ్రెష్ రేట్‌తో హై స్పీడ్ వ్యూవ్ ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ స్ర్కీన్ ఉపయోగించారు. ఇది రోజు వారి వాడకంలో మన్నికను కలిగి ఉంటుంది.
స్మార్ట్ ఫోన్ శామ్‌సంగ్ సొంత ఎక్సినోస్ 1380 చిప్‌సెట్‌ను ఇందులో పొందుపరిచారు. ఇది మృదువైన పనితీరును కలిగి ఉంది, మరింత సామర్థ్యాన్ని పెంచుతుంది. 128 GB స్టోరేజ్ తో 6GB RAM, 256 GB స్టోరేజ్ తో 8GB RAM వేరియంట్లను కలిగి ఉంది. వీటితో పాటు మరిన్ని వేరియంట్లతో సహా బహుళ కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి తెచ్చారు. వినియోగదారులు వారి యాప్‌లు, మీడియా, ఫొటోల కోసం స్టోరేజ్ ను మరింత పెంచుకునేలా ఎక్స్ టెన్సెన్ చేరుకునే అవకాశం కల్పించారు.
ఫొటోగ్రఫీ ఔత్సాహికులు Galaxy M35 5G డ్యూయెల్ కెమెరా సెటప్‌ను అభినందిస్తారు. షార్ప్, వివరణాత్మక షాట్ల కోసం 50 MP ప్రైమరీ సెన్సార్ ద్వారా హైలైట్ చేయబడింది, ఇది 8 MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2 MP మాక్రో కెమెరాతో అనుసంధానించ బడుతుంది. ఫ్రంట్ లో 13 MP సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇది స్పష్టమైన, శక్తివంతమైన స్వీయ-చిత్రాలను తీసుకునేందుకు అనుమతిస్తుంది.
ఇతర స్మార్ట్ ఫోన్ల కన్నా మంచి ఫొటోలను అందిస్తుంది. Dolby Atmos లాంటి సాంకేతికత ద్వారా స్టీరియో స్పీకర్లతో మల్టీ మీడియాకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఆడియోను మరింత స్పష్టంగా అందిస్తుంది. ఇది Wi-Fi 6, బ్లూటూత్ 5.3, NFC ఆధారిత ట్యాప్ అండ్ పే ఫంక్షనాలిటీ వంటి ఇతర కనెక్టివిటీ ఎంపికలతో పాటు వినియోగదారులు అధిక వేగంతో కనెక్ట్ అయ్యేలా 5G కనెక్టివిటీకి మద్దతిస్తుంది.
భద్రతా పరంగా Samsung తన విశ్వసనీయ నాక్స్ సెక్యూరిటీ ప్లాట్‌ఫారమ్ Galaxy M35 5Gలో చేర్చింది. బెదిరింపుల నుంచి వినియోగదారు డేటాను ఇది నిత్యం రక్షిస్తుంది. దృఢమైన 6,000mAh బ్యాటరీ దీర్ఘకాలిక వినియోగాన్ని అందిస్తుంది. ఇది ఎక్కువగా మ్యూజిక్, వీడియో, ఫోన్ వాడే వారికి మరింత ఆనందాన్ని అందిస్తుంది. ఎక్కువ సమయం బ్యాటరీ నిల్వ ఉండడంతో పాటు బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది.
ధర ఎంతంటే?
డేబ్రేక్ బ్లూ, మూన్‌లైట్ బ్లూ, థండర్ గ్రే వంటి మూడు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ మొబైల్ లభిస్తుంది, Galaxy M35 5G స్టైల్‌తో పాటు స్టైల్‌ను మిళితం చేస్తుంది. ధర రూ. 15,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ M35 స్మార్ట్‌ఫోన్ జూలై 20వ తేదీ నుంచి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్, శామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్, దేశ వ్యాప్తంగా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలు దారులకు అందుబాటులో ఉంచనున్నారు.
ఫోన్ కొనాలనుకునే వారు వీటితో లాంచ్ డే డిస్కంట్లు, భారీ ఆఫర్లు, క్యాష్ బ్యాక్ లాంటివి పొంది మొబైల్ ను సొంతం చేసుకోవచ్చు అని కంపెనీ తెలిపింది.