Chat GPT Sky Voice : వివాదంలో చాట్‌ జీపీటీ.. అడ్డంగా దొరికిపోయిన సీఈవో!

ఇంతలోనే కంపెనీని ప్రశ్నార్థకంలో పడేసిన చాట్‌ జీపీటీ వాయిస్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

Written By: NARESH, Updated On : May 21, 2024 2:27 pm

Chat GPT Sky Voice

Follow us on

Chat GPT Sky Voice : ఓపెన్‌ ఏఐ సీఈవో, చాట్‌ జీపీటీ సృష్టికర్త శామ్‌ అల్ట్‌మన్‌ అడ్డంగా దొరికిపోయారు. చేసేది లేక చాట్‌ జీపీటీ స్కై వాయిస్‌ నిలిపివేశారు. యాపిల్‌ సిరి వాయిస్‌ అసిస్టెంట్, అమెజాన్‌ అలెక్సా వాయి అసిస్టెంట్‌ తరహాలో చాట్‌ జీపీటీ యూజర్లకు వాయిస్‌ అసిస్టెంట్‌ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు శామ్‌ ఆల్ట్‌మన్‌ పనిచేస్తున్నారు. స్కై వాయిస్‌ పేరుతో తెచ్చే ఈ ఫీచర్‌లో ప్రముఖుల వాయిస్‌ వినిపిస్తుంది. ఎవరి వాయిస్‌ కావాలంటే వారి వాయిస్‌ సెలక్ట్‌ చేసుకుంటే చాట్‌ జీపీటీ సమాధానం టెక్స్‌ కాకుండా వాయిస్‌ రూపంలో ఇస్తుంది.

అనుమతి లేకుండా నటి వాయిస్‌..
స్కై వాయిస్‌ను డెవలప్‌ చేసే క్రమంలో శామ్‌ ఆల్ట్‌మన్‌ అద్భుత నటిగా, అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఫీమేల్‌ యాక్టర్, హాలీవులోని ఎన్నో ప్రముఖ చిత్రాల్లో నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ స్కార్టె జాన్సన్‌ వాయిస్‌ వినియోగించారు. తనను సంప్రదించకుండా తన వాయిస్‌ కాపీ చేసి చాట్‌ జీపీటీ స్కై వాయిస్‌లో ఎలా వినియోగిస్తారంటూ స్కార్లెట్‌ జాన్సన్, ఓపెన్‌ ఏఐ సీఈవోపై మండిపడ్డారు. గత సెప్టెంబర్‌లో వాయిస్‌ కోసం తనను సంప్రదించగా తాను తిరస్కరించారని తెలిపారు. ఇప్పుడు తన అనుమతి లేకుండా వినియోగించారని ఆరోపించారు. ‘చాట్‌ జీబీపీ 4.0 సిస్టమ్‌’ కోసం తన ప్రమేయం లేకుండా తన వాయిస్‌ ఉపయోగించారని పేర్కొన్నారు.

తనది కాదని బుకాయించి..
నటి స్కార్లెట్‌ జాన్సన్‌ ఆరోపణలను శామ్‌ అల్ట్‌మన్‌ ఖండించారు. స్కై వాయిస్‌ స్కార్లెట్‌ జాన్సన్‌ది కాదని బుకాయించారు. వేరే ప్రొఫెషనరల్‌ నటికి చెందినదని తెలిపారు. ఇంతలోనే కంపెనీని ప్రశ్నార్థకంలో పడేసిన చాట్‌ జీపీటీ వాయిస్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. స్కార్లెట్‌ ఆరోపణలను శామ్‌ ఆల్ట్‌మన్‌ ఖంచించారు. జాన్సన్‌పై ఉన్న గౌరవంతో తాము స్కై వాయిస్‌ నిలిపివేశామని ప్రకటించారు.