S, T, G in Text Messages: కామన్ గా చాలా మెసేజ్ లు వస్తుంటాయి. ఇక కంపెనీ తరపు నుంచి కూడా చాలా టెక్స్ట్ మెసేజ్ లు మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఏ మెసేజ్ దేనికి సంబంధించిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ టెక్స్ట్ మెసేజ్ ల ఈ మద్య సైబర్ నేరగాళ్లు మోసం చేయడం ఎక్కువగా మనిస్తున్నాం. లింక్ లు ఓపెన్ చేయడం వల్ల ఒక్క క్లిక్ తో అకౌంట్ లో ఉన్న డబ్బు మొత్తం పోతుంది. ఇంతకీ ఈ మెసేజ్ లు ఎక్కడ నుంచి వచ్చాయో చూడగానే ఎలా కనుక్కోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
LETTER S: కొన్ని మెక్స్ట్ మెసేజ్ లు వచ్చినప్పుడు దాని వెనుక S అని ఉంటుంది. ఒకసారి ఇప్పుడు మీ ఫోన్ తీసి మెసేజ్ బాక్స్ ఓపెన్ చేయండి. ఎక్కడి నుంచి వచ్చిందో దాని పేరు ఆ తర్వాత S అని ఉంటుంది. ఇలా ఉంటే ఆ మెసేజ్ సర్వీస్ కు సంబంధించినది అని అర్థం. స్విగ్గీ, జొమాటో, బ్యాంక్, డెలివరీ వంటి కంపెనీల నుంచి వచ్చే మెసేజ్ ల తర్వాత ఇలా S అని ఉంటుంది.
LETTER G: ఇక కొన్ని టెక్స్ట్ మెసేజ్ ల వచ్చిన తర్వాత మీరు G గమనించి ఉంటారు. అంటే దీని అర్థం ఆ మెసేజ్ గవర్నమెంట్ నుంచి వచ్చిందని గుర్తించాలి. ట్రాయ్, లేదా ఇతర గవర్నమెంట్ సంస్థల నుంచి వచ్చే మెసేజ్ లు ఇదే విధంగా LETTER G తో వస్తుంటాయి. సో మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ వాతావరణం మార్పు, అలర్ట్ వంటి వాటి సమయంలో కూడా గవర్నమెంట్ నుంచి ఇలాంటి మెసేజ్ లు వస్తుంటాయి.
Also Read: గూగుల్ సూపర్ ఫీచర్.. మెసేజ్‌కు టైమ్ సెట్ చేసుకునే ఛాన్స్..?
LETTER P: ఇక లెటర్ పీ అని వస్తే దాని అర్థం ప్రమోషనల్ మెసేజ్. ఏదైనా బ్రాండ్ కు సంబంధించిన మెసేజ్ ల తర్వాత సంస్థ పేరు ఆ తర్వాత పీ అని ఉంటుంది. వీటిని కూడా మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇవి పెద్ద ఇంపార్టెంట్ మెసేజ్ లు కూడా కాదు.
LETTER T: దీని అర్థం ట్రాన్సాక్షినల్ మెసేజెస్. అంటే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయినా క్రెడిట్ అయినా సరే ఈ లెటర్ తో కనిపిస్తుంది. సో మీరు ఇలాంటి మెసేజ్ వస్తే ఓ సారి ఆ మెసేజ్ ను ఓపెన్ చేసే చూడాల్సిందే. కాస్త అలెర్ట్ అవచ్చు.
ఇక కొన్నిసార్లు ఈ టీ కాకుండా ఎస్ అని కూడా వస్తుంది. ఇలా వచ్చి డబ్బు వచ్చినట్టు లేదా డబ్బులు పోయినట్టు గానీ మెసేజ్ వచ్చినా సరే పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే T,S లు లేకుండా కూడా కొన్ని సార్లు మీ అకౌంట్ లో డబ్బులు కట్ అయినట్టు, డబ్బులు వచ్చినట్టు మెసేజ్ లు వస్తాయి. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీ డిటైల్స్ మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. సో ఇప్పుడు మీకు మొత్తం అర్థం అయింది కాబట్టి ఇలాంటి మెసేజ్ లను ఓపెన్ చేయకండి. చేసి మోసపోవద్దు.