Laptop Battery: కరోనా మహమ్మారి సృష్టించిన ఉత్పాతం మరిచిపోలేనిది. ప్రపంచాన్ని గడగడలాడించిన వైరస్ తో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. దీంతో పలు సంస్థలు ఇంటి నుంచే పని చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ల్యాప్ టాప్ ల అవసరం ఏర్పడింది. వర్క్ ఫ్రం హోంకు మార్గం సుమగమమైంది. ల్యాప్ టాప్ లో బ్యాటరీ బ్యాక్ అప్ పడిపోతోంది. ఫలితంగా సమస్యలు వస్తున్నాయి. బ్యాటరీ బ్యాకప్ త్వరగా పోకుండా ఉండాలంటే ఏ చర్యలు తీసుకోవాలో కూడా సూచిస్తున్నారు. వీటిని పాటిస్తే మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలుసుకోవాలి.

వర్క్ ఫ్రం హోంతో ల్యాప్ టాప్ ల వినియోగం పెరిగిపోయింది. కొత్త వాటిలో బ్యాటరీ బాగానే ఉంటుంది కానీ పాత వాటిలో బ్యాటరీ బ్యాకప్ ఇబ్బంది పెడుతుంది. దీంతో పాతబడిన ల్యాప్ టాప్ ల బ్యాటరీ బ్యాకప్ ఇంతకు ముందులా ఉండకపోవచ్చు. ల్యాప్ టాప్ ను వాడుకునే క్రమంలో బ్యాటరీ బ్యాకప్ బాగుండాలంటే ఇవి తెలుసుకోండి. వీటిని పాటిస్తే మనకు బ్యాటరీ సురక్షితంగా ఉండొచ్చు. దీనికి గాను సులభమైన మార్గం ఎంచుకోండి. బ్యాటరీని పాడు కాకుండా చూసుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి.
విండోస్ 10 ల్యాప్ టాప్ ను ఉపయోగిస్తే కమాండ్ ప్రాం్ట్ ను లాంచ్ చేయాలి. తరువాత స్టార్ట్ మెనులో లేదా విండోస్ సెర్చ్ లో సీఎండీ లేదా కమాండ్ ప్రాంప్ట్ అని సెర్చ్ చేయొచ్ు. తరువాత ఫైల్ పాత్ సీ తో బ్లాక్ లేదా ఏదైనా కలర్ విండో కనబడుతుంది. ఇప్పుడు powercfg/batteryreport అనే టెక్ట్స్ టైప్ చేసి ఎంటర్ చేయాలి. సేవ్ చేసిన బ్యాటరీ లైఫ్ రిపోర్టు మెసేజ్ ల్యాప్ టాప్ స్క్రీన్ పై కనిపిస్తుంది. దీంతో ఈ రిపోర్టుతో పాటు ఫైల్ పాత్ కూడా చూపిస్తుంది. బ్యాటరీ రిపోర్టు యాక్సెస్ చేయకపోతే మీరు యూజర్ ఫోల్డర్ లో c;users/[your_user_name]battery-report html అనే ఫైల్ కోసం కూడా సెర్చ్ చేయవచ్చు.

ఫైల్ ఎక్స్ ప్లోరర్ నుంచి ఈ ఫోల్డర్ ను ఓపెన్ చేయాలి. లేదా ఫైల్ పాత్ ను కాపీ చేసుకోవాలి. ఈ రిపోర్టులో బ్యాటరీ లైఫ్ గ్రాఫిక్స్ ద్వారా సూచిస్తుంది. రిపోర్టు బ్యాటరీ పూర్తి సామర్థ్యం, ప్రస్తుత సామర్థ్యం గురించి సమాచారం తెలుస్తుంది. బ్యాటరీ అండ్ డివైజ్ యుసెస్ గురించి సమాచారం కూడా రిపోర్టులో ఉంటుంది. సమాచారాన్ని ఏసీ చార్టర్ లో చూపిస్తుంది. ఈ డేటాను పోల్చడం ద్వారా మీ ల్యాప్ టా్ డ్రైన్ అండ్ హెల్త్ గురించి సమాచారం వస్తుంది. ఇలా మన ల్యాప్ టాప్ బ్యాటరీని సంరక్షించుకునే అవకాశం ఉంటుంది.