https://oktelugu.com/

Selling Sun Light : ఎండ అమ్ముతున్నారట.. మీరేమైనా కొంటారా..

రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ అనేది ఒక స్టార్టప్. ఈ సంస్థ ఎండను విక్రయిస్తోంది. సాధారణంగా సూర్యుడు సాయంత్రం పూట అస్తమిస్తాడు. ఆ సమయంలో ఈ కంపెనీ సోలార్ ప్లేట్స్ మీద ఎండను రిఫ్లెక్ట్ చేసే స్పేస్ మిర్రర్స్ ను ఏర్పాటు చేస్తోంది. ఫలితంగా సోలార్ ప్లేట్ల కెపాసిటీ పెరుగుతోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 9, 2024 / 10:36 AM IST

    Selling Sun Light

    Follow us on

    Selling Sun Light : కరోనా సమయంలో చాలామంది ఆక్సిజన్ కొనుక్కున్నారు. ఆ మధ్య ఢిల్లీలో కాలుష్యం అధికమైనప్పుడు శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు ఆక్సిజన్ సిలిండర్లు కొన్నారు. ఇక మన దేశంలో కొన్ని ప్రాంతాలలో సరైన తాగునీటి సౌకర్యం ఉండదు కాబట్టి జనం గొంతు తడుపుకునేందుకు నీళ్లను కొనుగోలు చేస్తారు. కానీ చరిత్రలో తొలిసారిగా రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ అనే స్టార్ట్ అప్ సంస్థ ఎండను విక్రయిస్తోంది. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది ముమ్మాటికి నిజం.

    రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ అనేది ఒక స్టార్టప్. ఈ సంస్థ ఎండను విక్రయిస్తోంది. సాధారణంగా సూర్యుడు సాయంత్రం పూట అస్తమిస్తాడు. ఆ సమయంలో ఈ కంపెనీ సోలార్ ప్లేట్స్ మీద ఎండను రిఫ్లెక్ట్ చేసే స్పేస్ మిర్రర్స్ ను ఏర్పాటు చేస్తోంది. ఫలితంగా సోలార్ ప్లేట్ల కెపాసిటీ పెరుగుతోంది. ఒక సాటిలైట్ కు భారీ మిర్రర్ ఏర్పాటు చేసి.. దానిని స్పేస్ లోకి పంపి.. ఆ తర్వాత అక్కడి నుంచి భూమ్మీద కోరుకున్నచోట ఎండలో రిఫ్లెక్ట్ చేయడం ఇందులోనే ముఖ్య అంశం. అయితే ఫస్ట్ శాటిలైట్ ఇంకా డెవలప్మెంట్ స్టేజిలోనే ఉంది. అయినప్పటికీ హాట్ ఎయిర్ బెలూన్ కు పెద్ద మీటర్ ఏర్పాటు చేసి.. ఇటీవల నిర్వహించిన ప్రయోగం సక్సెస్ అయింది. వచ్చే సంవత్సరం చీకట్లో ఎండను విక్రయించడం మొదలు పెడతామని కంపెనీకి సంబంధించిన సాంకేతిక అన్ని పనులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ సర్వీస్ 4 నిమిషాల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సుమారు మూడు మైళ్ళ విస్తీర్ణంలో ఎండ వెలుగు ప్రకాశం అందంగా కనిపిస్తుంది. మ్యాప్ లో లొకేషన్ ఎంచుకొని, దానిని ఓకే చేసిన తర్వాత ఎండ ప్రసారమవుతుంది.

    ఎలాంటి పనులైనా చేసుకోవచ్చు

    అయితే ఇలాంటి ఎండ ద్వారా ఎలాంటి పనులైనా చేసుకోవచ్చని.. ముఖ్యంగా రాత్రిపూట విద్యుత్ అవసరం లేకుండానే ముఖ్యమైన పనులు పూర్తి చేయవచ్చని రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ కంపెనీ సాంకేతిక నిపుణులు చెబుతున్నారు..” సాధారణంగా రాత్రిపూట విద్యుత్ అవసరం ఎక్కువగా ఉంటుంది. భారీ పరిశ్రమలలో రాత్రిపూట పనిచేయడం వల్ల రకరకాల ఖర్చులు చేయాల్సివస్తుంది. ఇలా రాత్రిపూట కూడా ఎండను రిఫ్లెక్ట్ చేయగలిగితే.. ఇంత స్థాయిలో విద్యుత్ ఖర్చుకాదు. దానివల్ల పర్యావరణ కాలుష్యం చోటు చేసుకోదు. పైగా స్వచ్ఛమైన వెలుతురులో ఉత్సాహంగా పనిచేసుకోవచ్చు. ఇలా రాత్రిపూట ఎండ రిఫ్లెక్ట్ చేయడం వల్ల పంటల దిగుబడిని కూడా పెంచుకోవచ్చు. దానికోసం ప్రత్యేకంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా కోరుకున్నచోట ఎండను ప్రతిఫలింప చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని.. ఈ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో భవిష్యత్తులో చాలా మార్పులు చోటు చేసుకుంటాయని” రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ” సూర్యుడి ద్వారా వచ్చే ఎండను వాణిజ్యపరమైన వస్తువును చేయడంపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ భూమి మీద కమర్షియల్ కానీ వస్తువు ఏదైనా ఉందా.. సూర్యుడి వేడిని, సముద్రం నీటిని ఉపయోగించి తయారుచేస్తున్న ఉప్పును మాత్రం అమ్మ కోవడం లేదా” అంటూ రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.