Realme Mobile: చైనీస్ ఫోన్ రియల్ మి వినియోగదారులు ఎక్కువే. తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్స్ అందించడంతో పాటు నాణ్యమైనదిగా గుర్తింపు పొందిన రియల్ మీ నుంచి అనేక మోడళ్లు వచ్చాయి. తాజాగా ఈ కంపెనీ నుంచి Real me 12 + 5G ని ఈ బుధవారం రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు వచ్చిన రియల్ మీ ఫొన్ల కంటే ఇది భిన్నంగా ఉండడంతో పాటు కొత్త ఫీచర్స్ ఆకర్షిస్తున్నాయి. మరి ఈ మొబైల్ గురించి వివరాల్లోకి వెళితే..
Real me 12 + 5G ఫీచర్స్ లోకి వెళితే ఇందులో 6.67 అంగుళాల AMOLED డిస్ ప్లేను కలిగి ఉంది. 5,000 ఎంఏహెచ్ బ్యారటీతో నడిచే దీనికి 67వాట్స్ చార్జర్ సపోర్టు చేస్తుంది. అలాగే ఇందులో మీడియా టెక్ డిమెన్ స్టీ 70500 ఆక్టా కోర్ చిప్ సెట్ ను అమర్చారు. 8 జీబీ రామ్ తో పాటు 256 ఇంటర్నర్ స్టోరేజిని అమర్చారు. ఇది అండ్రాయిడ్ 14 ఆధారంగా రియల్ మీ UI 5.0 పై పనిచేస్తుంది. మూడు సంవత్సరాల వరకు సెక్యూరిటీ, 2 సంవత్సరాల వరకు ఓఎస్ అప్డేట్ గ్యారెంటీని ఇవ్వనున్నారు.
ప్రతీ స్మార్ట్ మొబైల్ లో ఫీచర్స్ తో పాటు కెమెరాకు ప్రాధాన్యం ఇస్తారు. Real me 12 + 5G కెమెరా విషయానికొస్తే.. 50MP Sony LYT -600 మెయిన్ కెమెరా ఉంది. 8 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపీ పోర్ట్రెయిట్ సెన్సార్ ను అమర్చారు. 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ఈ మొబైల్ లో పయనీర్ గ్రీన్, నావగేటర్ బీజ్ షేడ్స్ లల్లో లభిస్తోంది. ఇక ధర విషయానికొస్తే 8 జీబీ మొబైల్ ను రూ.20,999 తో విక్రయిస్తున్నారు. రియల్ మీ 12 5 జీ మొబైల్ 6 జీబీ ని రూ.16,999తో విక్రయించనున్నారు.
