Realme 16 Pro: Mobile కొనుగోలు చేసే వారు ప్రస్తుత కాలంలో కెమెరా, బ్యాటరీ గురించి ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే చాలామంది సోషల్ మీడియాలో కంటెంట్ కోసం ఫోటోగ్రఫీ, వీడియోలను రికార్డింగ్ చేసుకోవడానికి కెమెరా హై రిజల్యూషన్ తో ఉండాలి. అలాగే రోజంతా మొబైల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. బ్యాటరీ సేవింగ్ ఎక్కువగా ఉండాలి. ఈ రెండు బాగున్న ఫోన్లు మార్కెట్లోకి అరుదుగా వస్తుంటాయి. అలాంటి వాటిలో, Realme కంపెనీకి చెందిన ఓ మొబైల్ ఫోన్ కొత్త సంవత్సరంలో రాబోతుంది. ఇందులో అడ్వాన్స్ టెక్నాలజీ తో పాటు అద్భుతమైన కెమెరా పనితీరు ఉందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. ఈ ఫోన్ ఫీచర్స్ లోకి వెళ్తే..
Realme కంపెనీ నుంచి 16 Pro మొబైల్ ను 2026 జనవరి 6వ తేదీన లాంచ్ చేయనున్నారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఇప్పటికే ఆన్లైన్లో ఉంచారు. ఈ మొబైల్ కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో 200 MP మెయిన్ కెమెరా ను సమాచారం. అలాగే 50 MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండరున్నాయి. ఇది ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన రియల్ మి 14 ప్రో కు సమానంగా ఉంటాయి. దీంతో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారికి ఈ కెమెరా సపోర్ట్ గా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా నాణ్యమైన వీడియోలు తీయాలని అనుకునే వారికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ కొత్త రియల్ మీ ఫోన్లో 12gb రామ్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇది LPDDR5X తో పని చేయనుంది. అలాగే 512 GB స్టోరేజ్ ఉండడంతో కావాల్సిన ఫైల్స్ ను నిల్వ చేసుకోవచ్చు. రియల్ మీ 16 ప్రో curved డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 6.78 అంగుళాల AMOLED డిస్ప్లేను ఉండడంతో.. నిట్స్ పీక్ బ్రైట్నెస్.. 1.48 ఎంఎం స్లిమ్ బిజెల్స్ ఉండడంతో 1.5k రిజర్వేషన్ తో వీడియోలను చూడవచ్చు.. అలాగే ఇందులో బలమైన బ్యాటరీ కూడా అమర్చారు. ఈ మొబైల్లో 7,000 mAh బ్యాటరీని ఉంచారు. ఈ బ్యాటరీ 80 వాట్ చార్జింగ్ సపోర్ట్ తో మద్దతు ఇస్తుంది. దీని డౌన్ టైం తక్కువగా ఉండడంతో రోజంతా వినియోగించినా కూడా బ్యాటరీ సేవ్ అవుతుంది. అలాగే 9.3 గంటలపాటు గేమింగ్ కోసం వాడుకోవచ్చు. 20 గంటల పాటు సోషల్ మీడియా కోసం ఉపయోగించుకోవచ్చు.
రియల్ మీ మొబైల్ అనగానే అర్బన్ వైల్డ్ డిజైన్ కలిగి ఉంటుందని చాలామంది భావన. వారికి అనుగుణంగానే ఈ కొత్త ఫోన్ కూడా డిజైన్తో ఆకట్టుకుంటుంది. ఇక ఈ మొబైల్ మార్కెట్లోకి వస్తే రూ.43,999 తో విక్రయించే అవకాశం ఉంది. అయితే బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మరింత తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. మరో విశేషమేంటంటే Realme 16 Pro తో పాటు Realme 16 Pro+కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.