Jailer 2 Shah Rukh Khan: సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) లేటెస్ట్ చిత్రం ‘కూలీ'(Coolie Movie) ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై ఎలాంటి నెగిటివిటీ ని మూటగట్టుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో సినిమా అంటే ఆడియన్స్ లో అంచనాలు వేరే లెవెల్ లో ఉంటాయి. కానీ ఆ అంచనాలకు ఈ చిత్రం ఏ మాత్రం సరితూగేలా అనిపించ లేదు. అయినప్ప్పటికీ సెన్సేషనల్ కాంబినేషన్ కావడం తో మొదటి మూడు రోజులు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత నాల్గవ రోజు నుండి భారీ డ్రాప్స్ సొంతం చేసుకున్నప్పటికీ కాస్త స్టడీ రన్ ని కనబరుసు 516 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాలో అక్కినేని నాగార్జున మరియు అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్స్ ని తీసుకొని సరిగా వాడుకోలేదంటూ లోకేష్ కనకరాజ్ పై ఫ్యాన్స్ ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు.
నాగార్జున క్యారక్టర్ ఒక మోస్తరు గా పర్వాలేదు అనిపించినా, అమీర్ ఖాన్ క్యారక్టర్ ని మాత్రం కామెడీ గా మార్చేశాడు. దేశం లో 2000 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్. అలాంటి స్టార్ హీరో తో చేయించాల్సిన రోల్ ఇదా?, లోకేష్ కి మైండ్ చెడిపోయిందా?, అసలు అమీర్ ఖాన్ ని అంత కామెడీ గా చూపించాలనే ఆలోచన ఎలా వచ్చింది అంటూ సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. అమీర్ ఖాన్ కూడా అనవసరంగా ఈ సినిమాని ఒప్పుకున్నాను అని ఒక ఇంటర్వ్యూ లో ఫీల్ అయ్యాడు. అయితే ఆ క్యారక్టర్ కి అమీర్ ని తీసుకోమని ఒత్తిడి చేసింది సూపర్ స్టార్ రజినీకాంత్ నే అట. అదే విధంగా సైమన్ క్యారక్టర్ కి కూడా ఒక స్టార్ హీరో నే తీసుకోమని చాలా ఒత్తిడి చేసాడట. అందుకే నాగార్జున, అమీర్ ఖాన్ లు ఈ చిత్రం కోసం వచ్చారు.
ప్రస్తుతం రజినీకాంత్ ‘జైలర్ 2’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య ని స్పెషల్ రోల్ కోసం తీసుకునేందుకు చాలా గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ బాలయ్య మాత్రం ఒప్పుకోలేదు . దీంతో రజీనీకాంత్ ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ని సంప్రదించాడట. ఆయన కూడా ఈ చిత్రం లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియా లో రజినీకాంత్ పై ట్రోల్స్ వేరే లెవెల్ లో పడుతున్నాయి. ఇంకో హీరో లేనిదే రజినీకాంత్ సినిమాలు చేసేలా లేడుగా, ఆయన స్టార్ స్టేటస్ కలెక్షన్స్ ని రప్పించడం లో సరిపోవడం లేదేమో, అందుకే ఇలా చేస్తున్నాడు. కూలీ లో అమీర్ ఖాన్ తో కామెడీ రోల్ వేయించాడు , ఇప్పుడు షారుఖ్ ఖాన్ తో ఎలాంటి రోల్ వెయ్యిస్తాడో, ఖాన్స్ పరువు తీయడమే రజినీకాంత్ లక్ష్యం లాగా ఉందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామేంన్స్ చేస్తున్నారు.