OPPO Reno 15 pro: ప్రముఖ మొబైల్ కంపెనీ OPPO భారతీయ వినియోగదారులకు అనుగుణంగా మొబైల్స్ ను తీసుకువస్తూ ఉంటుంది. ఇప్పటికే వచ్చిన ఎన్నో మొబైల్స్ అందరిని ఆకట్టుకున్నాయి. అయితే లేటెస్ట్ గా రెనో15 మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. దీంతోపాటు Reno Pro కూడా రానుంది. ఈ మొబైల్స్ లో కెమెరా హైలెట్ గా ఉండే విధంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా అత్యధిక స్పీడ్ గా ఉండే RAM, స్టోరేజ్ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. అయితే దీని ధర విషయంలో ప్రత్యేకమైన చర్చ సాగుతోంది. మిగతా దేశాల్లో కంటే భారతదేశంలో ధర ఎక్కువగా ఉంటుందని కొందరి అంచనా. మరి దీనిపై అంచనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
OPPO కంపెనీకి చెందిన Reno 15 pro డిస్ప్లే గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇందులో 6.32 అంగుళాల AMOLED డిస్ప్లేను అమర్చారు. దీంతో ఇందులో క్వాలిటీ వీడియోలను అద్భుతంగా చూడవచ్చు. అలాగే వీడియో గేమ్స్ ఆడుకునే వారికి ఇది అనుగుణంగా ఉంటుంది. ఈ మొబైల్ బరువు సుమారు 187 గ్రాములు, 7.99 మిల్లీమీటర్ల మందం ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. దీంతో చూడడానికి ఇది ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉంది.
ఒప్పో మొబైల్ అనగానే కెమెరా గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటారు. వినియోగదారులకు అనుగుణంగానే ఇందులో 200 MP ప్రధాన కెమెరాను అమర్చారు. అలాగే 50 MP అల్ట్రా వైడ్ కెమెరా పనిచేయనుంది. వీటితోపాటు మరో 50MP టెలిఫోటో షూటర్ కూడా ప్లస్ కానుంది. సెల్ఫీ దిగాలని అనుకునేవారు 50 MP కెమెరా కూడా పనిచేసే అవకాశాలున్నాయి. దీంతో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ తోపాటు 4k వీడియోలు తీయాలని అనుకునే వారికి ఈ కెమెరా అనుకూలంగా ఉంటుంది. అలాగే లాంగ్ షాట్ స్నాప్స్ తోపాటు డే అండ్ నైట్ ఫోటోలు కూడా అనుకున్న విధంగా వచ్చే అవకాశం ఉంది.
ఇందులో బ్యాటరీ వ్యవస్థ కూడా బలంగానే ఉంది. ఈ మొబైల్ లో 6,500mAh బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీ 80 W ఫాస్ట్ ఛార్జింగ్తో సపోర్ట్ ఇవ్వనుంది. ఫోటోలు, వీడియోలు ఎక్కువగా తీసుకునేవారు.. సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి ఇందులో కావలసినంత స్టొరీ చూసుకోవచ్చు. అయితే ఈ స్టోరేజ్ చేసుకునే సమయంలో చార్జింగ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో బ్యాటరీ డౌన్ టైం తక్కువగా ఉండడంతో పాటు తొందరగా చార్జింగ్ కావాలని అనుకునే వారికి ఫాస్ట్ చార్జర్ ఎంతో సపోర్ట్ గా ఉండనుంది.
ఇక ఈ మొబైల్ ధరపై ప్రత్యేకంగా చర్చ సాగుతోంది. ఈ మొబైల్ మార్కెట్లోకి వస్తే రూ.60,000 ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మొబైల్ ViVo x 200 FE కి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే ఇప్పటివరకు వచ్చిన ఒప్పో రెనో ప్రో రూ.49,999 ధరతో విక్రయించారు. దీనికంటే రూ.10,000 ఎక్కువగా అనిపించినప్పటికీ ఇందులో అడ్వాన్స్ ఫీచర్లు ఉండనున్నాయి.