Mega Victory Mass Lyrical Video: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad garu) చిత్రం వచ్చే నెల సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఒకొక్కటిగా విడుదల చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వదిలిన కంటెంట్ లో ‘మీసాల పిల్ల’ సాంగ్ బాగా హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత విడుదలైన ‘శశిరేఖ’ సాంగ్ యావరేజ్ అనిపించుకుంది. అయితే అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూ లో చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్ లో మేము తీసిన సాంగ్ వేరే లెవెల్ లో వచ్చింది, అభిమానులు మెంటలెక్కిపోతారు అని చెప్పుకొచ్చాడు. చిరంజీవి, వెంకటేష్(Victory Venkatesh) కాంబినేషన్ లో పాట అంటే ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు చెప్పండి?, అలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలోనే ప్రోమో ని విడుదల చేశారు. ఇంతేనా అని అనిపించింది, కానీ నేడు ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేశారు. దీనికి మాత్రం రెస్పాన్స్ అదిరిపోయింది.
చిరంజీవి, వెంకటేష్ కలిసి ఒక ఫ్రేమ్ లో కనిపిస్తేనే చూసేందుకు అభిమానులకు ఒక పండుగ లాగా ఉంటుంది, అలాంటిది వాళ్లిద్దరూ కలిసి మాస్ స్టెప్పులు వేస్తే థియేటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే కదా. ఆ రేంజ్ లోనే వీళ్ళ చేత స్టెప్పులు వేయించాడు అనిల్ రావిపూడి. ఇద్దరు లుంగీలు ఎత్తుకొని మరీ మాస్ స్టెప్పులు వేసిన విధానం ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. వెంకటేష్ లుంగీ స్టెప్పులు వేయడం మనం ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం లోనే చూసేసాం. చిరంజీవి ఇలా లుంగీ కట్టుకొని మాస్ స్టెప్పులు వేయడం చూసి దశాబ్దాలు దాటింది. మళ్లీ ఆయన్ని ఆ గెటప్ లో స్టెప్పులు వేయడం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ట్యూన్ కూడా క్యాచీ గానే ఉంది. కచ్చితంగా ఈ పాట కూడా క్లిక్ అవ్వచ్చేమో కానీ, ‘సంక్రాంతికి వస్తున్నాం’ పాటలతో పోలిస్తే కాస్త తక్కువ అనే చెప్పాలి.
ఆ చిత్రం నుండి విడుదలైన ప్రతీ పాట బ్లాస్ట్ అయ్యింది. ఎక్కడ చూసినా ఆ పాటలే వినిపించేవి. ‘మన శంకర వరప్రసాద్’ లో కూడా పాటలు బాగున్నాయి కానీ, ఆ రేంజ్ లో మాత్రం లేవనే చెప్పాలి. సినిమా విడుదల తర్వాత ఈ పాటలు పెద్ద హిట్ అవుతాయేమో చూడాలి. ‘శశిరేఖ’ పాట ఈ సినిమా పై హైప్ పెంచేందుకు ఏమాత్రం ఉపయోగపడలేదు. కానీ నేడు విడుదలైన ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ మాత్రం సినిమా పై మంచి హైప్ పెంచేలా అనిపిస్తోంది. ఇక ట్రైలర్ ఒక్కటే బ్యాలన్స్, అది కూడా రిలీజ్ అయితే అభిమానులు రిలాక్స్ అవుతారు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, జనవరి 4న ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారట మేకర్స్. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇకపోతే నేడు విడుదలైన ఈ బ్లాక్ బస్టర్ పాట ని మీరు కూడా విని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
