Phonepe And Google Pay: ఉదయం నుంచి సాయంత్రం వరకు.. కూరగాయల నుంచి.. షాపింగ్ మాల్ లో వస్తువుల కొనుగోలు వరకు.. బిల్లు చెల్లించడానికి గూగుల్ పే, ఫోన్ పే ద్వారా UPI ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా ఒక్క రూపాయి నుంచి లక్షల రూపాయల వరకు మనీ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అందుకే చాలామంది దీనికి అలవాటు పడిపోయారు.. ఒక రకంగా చెప్పాలంటే మార్కెట్లో లిక్విడ్ క్యాష్ తగ్గిపోయిందని అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది డిజిటల్ పేమెంట్ నే ఇష్టపడుతున్నారు. అయితే ఈ డిజిటల్ పేమెంట్ లో పాస్వర్డ్ చోరీ.. యూపీఐ పిన్ ఇతరులు తెలుసుకొని మోసాలు చేస్తున్నారు. ఇలా కొన్ని లక్షల రూపాయలు దొంగిలించారు. అయితే ఇలాంటి మోసాలకు చెక్ పెట్టేందుకు National Payment Corporation of India (NPCI) కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది.. అదే ఫింగర్ ప్రింట్స్, ఫేషియల్ పేమెంట్స్..
ప్రముఖ వార్తా సంస్థ Raiters ప్రకారం.. గురువారం నుంచి ఫింగర్ ప్రింట్స్, ఫేషియల్ పేమెంట్స్ భారతదేశంలో అందుబాటులోకి రానుందని తెలిపింది. NPCI ఆధ్వర్యంలో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు పేర్కొంది. గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీ చెల్లింపులు పిన్ ఆప్షన్లతో పాటు ఇతర వాటిని కూడా చేర్చాలని పేర్కొంది. ఆ బ్యాంక్ సూచనల మేరకు NPCI ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇకనుంచి యూపీఐ పేమెంట్ చేసేవారు పిన్ ఎంట్రీ చేయాల్సిన అవసరం లేకుండా.. ఫింగర్ ప్రింట్స్ తో పేమెంట్ చేయవచ్చు. అలాగే ఫేషియల్ తో కూడా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డులోని ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఈ పేమెంట్ జరుగుతుంది. అలాగే ఫేషియల్ కూడా ఆధార్ కార్డు ప్రకారంగానే మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది.
ఈ విధానం వల్ల ఎంతోమందికి ఉపయోగపడనిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. వృద్ధులు లేదా నిరక్షరాస్యులు యూపీఐ ద్వారా పేమెంట్ చెల్లించాలని అనుకుంటే ఫింగర్ ప్రింట్స్ లేదా ఫేషియల్ ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఒక్కోసారి మొబైల్ దొంగిలించబడినా.. పిన్ మర్చిపోయినా.. ఇది చాలావరకు ఉపయోగపడుతుంది. అయితే Raiters ఈ విధానం గురువారం నుంచి అమల్లోకి వస్తుందని తెలిపినా.. అధికారికంగా మాత్రం NPCI పేర్కొనలేదు. దీంతో ఇది ఎప్పటినుంచి అమల్లోకి వస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
ఫేషియల్ పేమెంట్ విధానం ఇప్పటికే చైనాలో అమల్లో ఉంది. అందుకు సంబంధించిన వీడియోలు ఇటీవల వైరల్ అయ్యాయి. ఒక వ్యక్తి సూపర్ మార్కెట్ కు వెళ్లి ఫేషియల్ ద్వారా.. ఫింగర్ ప్రింట్ ద్వారా పేమెంట్ చేసిన విధానాన్ని చూపించారు. ఇది భారత్ లోకి వస్తే బాగుండు అని కొందరు కామెంట్స్ చేశారు. అయితే వారికి అనుగుణంగా ఇప్పుడు ఈ విధానం అమలులోకి రావడంతో కొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫేషియల్, ఫింగర్ ప్రింట్స్ పేమెంట్ తో సైబర్ నేరాల నుంచి కాపాడుకోవచ్చని కొందరు నిపుణులు అంటున్నారు.