Rohit Sharma New Look: రోహిత్ శర్మ.. అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు హిట్ మ్యాన్.. టీ 20లకు, టెస్టులకు గుడ్‌బై చెప్పారు. టీ20 వరల్డ్ కప్ తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. చాలా రోజుల తర్వాత బీసీసీఐ సెలక్టర్లు ఆస్ట్రేలియాతో జరిగే వన్డే జట్టులో రోహిత్‌కు స్థానం కల్పించారు. అయితే ఇంతకాలం విశ్రాంతి తీసుకున్న హిట్‌మ్యార్ ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టిపెట్టారు. గతంలో బొద్దుగా ఉన్న రోహిత్ ఇప్పుడు ఫిట్‌గా న్యూ లుక్‌లో కొత్తగా కనిపిస్తున్నాడు. క్రమమైన వ్యాయామం, కంట్రోల్డ్ డైట్స్ వల్ల సుమారు 10 కిలోల బరువు తగ్గి మరింత సన్నగా, చురుకుగా మారారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అతని ఫొటోలు ఇప్పుడు ఆకట్టుకుంటున్నాయి.
సియట్ అవార్డ్స్‌లో గ్లామరస్ ఎంట్రీ
సియట్ క్రికెట్ అవార్డ్స్ వేడుకలో రోహిత్ తన భార్య రితికా సజ్దే సహా ర్యాంప్‌పై అడుగుపెట్టినప్పుడు అందరి దృష్టి ఆయనపై కేంద్రీకృతమైంది. సింపుల్ కానీ స్టైల్‌తో నిండిన దుస్తులతో ఆయన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా మారింది. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
‘‘ఇదే అసలు హిట్మ్యాన్!’’
రిత్రం, కొత్త లుక్ గురించి అభిమానులు అమితంగా ప్రశంసిస్తున్నారు. ‘‘రోహిత్ మరింత యంగ్‌గా కనిపిస్తున్నాడు’’, ‘‘మోటివేషన్ కావాలంటే రోహిత్‌ని చూడాలి’’ వంటి కామెంట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో వెల్లువెత్తుతున్నాయి. ఈ మార్పు కేవలం బాహ్య రూపానికి పరిమితమే కాదు.. ఆత్మవిశ్వాసం, ఆటతీరులో సైతం పరిమాణాత్మక మెరుగుదలని సూచిస్తోంది. రాబోయే టోర్నమెంట్లలో రోహిత్ మరింత ఫిట్‌గా, ఎగ్జిక్యూషన్‌లో చురుకుగా ఉంటారని అనేక విశ్లేషకులు భావిస్తున్నారు.
రోహిత్ రూపంలో వచ్చిన ఈ మార్పు యంగ్ క్రికెటర్లకు, అభిమానులకు ఫిట్‌నెస్ ప్రాధాన్యత గురించి ఒక స్ఫూర్తిదాయక సందేశాన్ని చేరుస్తోంది. వ్యక్తిగత క్రమశిక్షణతో సాధ్యమయ్యే మార్పుకు ఆయన ఉదాహరణగా నిలుస్తున్నారు.