Predictive cancer test: కాలం మారుతున్న కొద్ది అనేక కొత్త రోగాలు సంక్రమిస్తున్నాయి. అయితే కరోనా వైరస్ తర్వాత చాలామంది ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కానీ కొంతమంది తమ ప్రాణాంతకమైన రోగాలను ముందే గుర్తించలేకపోతున్నారు. చివరి స్టేజిలో గుర్తించినా చికిత్స తీసుకునే సమయంలోనే ప్రాణాలు పోతున్నాయి. ఇలాంటి సమయంలో ముందే ఏదైనా వ్యాధి గురించి తెలుసుకుంటే ఫస్ట్ స్టేజిలో ఉన్నప్పుడే చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యాధుల్లో క్యాన్సర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. క్యాన్సర్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత నాలుగు స్టేజిలో ఉంటుంది. అయితే దీనిని ముందే గుర్తిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. మరి అందుకోసం ఏం చేయాలి?
భారత్లో వైద్య విధానం రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది. కొన్ని వ్యాధులను గుర్తించడానికి.. నయం చేయడానికి అనేక రకాలుగా సౌకర్యాలు వస్తున్నాయి. విదేశాల్లో కొందరు ప్రముఖ వైద్యులు భారత్కు వచ్చి అనేక చికిత్సల గురించి పరిచయం చేస్తున్నారు. అలాగే ఇక్కడి వారు విదేశాల్లో చదువుకొని వైద్య విధానంలో కొత్త మార్పులు తీసుకొస్తున్నారు. ఇప్పుడు క్యాన్సర్ వ్యాధి విషయంలోనూ భారత్ అప్డేట్ అవుతుందని చెప్పుకోవచ్చు.
Also Read: రేపు చికెన్ తినాలని అనుకుంటున్నారా? అయితే ఈ పార్ట్స్ లేకుండా చూసుకోండి..
ఒకప్పుడు క్యాన్సర్ వస్తే మరణం తప్ప మరో అవకాశం లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు క్యాన్సర్ కు చికిత్స భారత్లో అందుబాటులోకి వస్తుంది. అయితే క్యాన్సర్ నాలుగు స్టేజిలో ఉంటుంది. వీటిలో మొదటి రెండు స్టేజీలో గుర్తిస్తే చికిత్సకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత స్టేజిలో గుర్తిస్తే నయం చేసే అవకాశం ఉండదు. అయితే ఒక వ్యక్తిలో క్యాన్సర్ ఉందా? లేదా? అనే విషయాన్ని ముందే తెలుసుకుంటే ప్రారంభంలోనే దానికి సరైన చికిత్స తీసుకొని నయం చేసుకోవచ్చు.
అందుకోసం క్యాన్సర్ ను గుర్తించడానికి ముందే టెస్ట్ చేయించుకోవాలి. ఈ టెస్టును Predictive Genetic Testing For Cancer అని అంటారు. ఇది ఒకప్పుడు విదేషాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు భారత్లో కూడా అందుబాటులోకి వచ్చింది. అందులోనూ హైదరాబాదులోనూ ఈ టెస్టును చేస్తున్నారు. దీని ద్వారా క్యాన్సర్ ఉంటే అది ఏ స్టేజిలో ఉందో తెలుసుకోవచ్చు. ఒకవేళ నార్మల్ పర్సన్స్ కూడా తమకు అనుమానం ఉంటే క్యాన్సర్ టెస్టును చేయించుకోవచ్చు. ఇలా చేస్తే క్యాన్సర్ ను ముందే గుర్తించి సరైన చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది.
Also Read: ఉదయం పూట తినాల్సిన అసలు సిసలు ఫుడ్డు ఇదే
ఇప్పటివరకు చాలామంది క్యాన్సర్ ను ముందే గుర్తించగా చివరి స్టేజిలో గుర్తించి ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. ఎంత డబ్బున్నా.. సరైన సమయంలో క్యాన్సర్ ను గుర్తించకపోతే ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాకాకుండా ముందే గుర్తించి చాలామంది చికిత్స తీసుకొని క్యాన్సర్ నుంచి కోరుకున్న వారు కూడా ఉన్నారు. నేటి కాలంలో కలుషిత వాతావరణం ఏర్పడినందువల్ల రకరకాల క్యాన్సర్ ఏర్పడుతుంది. అయితే ఈ టెస్ట్ ద్వారా ఎలాంటి క్యాన్సర్ ఉందో కూడా గుర్తించవచ్చు. ఈ యొక్క టెస్టు తో 70 రకాల క్యాన్సర్లను గుర్తిస్తుంది. దీంతో ఏ క్యాన్సర్ ఉందో గుర్తించి దానికి సరైన చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది.