Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీPoco F7 New Phone Launch: రూ.35వేలలోపు అదిరిపోయే ప్రాసెసర్ తో.. పోకో ఎఫ్7 వచ్చేస్తోంది.....

Poco F7 New Phone Launch: రూ.35వేలలోపు అదిరిపోయే ప్రాసెసర్ తో.. పోకో ఎఫ్7 వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు లీక్

Poco F7 New Phone Launch: మార్కెట్లోకి కొత్త ఫోన్ ఎప్పుడు వస్తుందా అని చూసేవారికి, అది కూడా మంచి ఫీచర్లతో బడ్జెట్ ధరలో కావాలనుకునేవారికి, షియోమీ (Xiaomi) సబ్‌బ్రాండ్ అయిన పోకో నుంచి ఒక అద్భుతమైన ఫోన్ రాబోతోంది. అదే పోకో ఎఫ్7. ఈ ఫోన్ జూన్ 24న ఇండియాలో లాంచ్ అవుతుందని కంపెనీ ఇప్పటికే కన్ఫాం చేసింది. లాంచ్‌కు ముందే ఈ ఫోన్ గురించిన కొన్ని కీలక వివరాలు, ధర బయటికొచ్చాయి. దీని ధర రూ.35,000 లోపు ఉంటుందని అంచనా.

పోకో ఎఫ్7 ఫోన్, క్వాల్‌కామ్ నుంచి వచ్చిన సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్‌తో రాబోతుంది. ఈ ప్రాసెసర్ వల్ల ఫోన్ పర్ఫామెన్స్ చాలా ఫాస్టుగా ఉంటుంది. ఎలాంటి హెవీ యాప్స్‌నైనా, గేమ్‌లనైనా సులువుగా నడిపేయగలదు. 12GB LPDDR5x RAMతో పాటు, అదనంగా 24GB వరకు టర్బో RAM కూడా ఉంటుంది. స్టోరేజ్ కోసం హై-ఎండ్ ఫోన్‌లలో వాడే UFS 4.1 టెక్నాలజీని ఇందులో ఇచ్చారు. అంటే, ఫైల్స్ చాలా ఫాస్టుగా ఓపెన్ అవుతాయి, సేవ్ అవుతాయి.

గేమింగ్ చేసేవాళ్లకు, ఎక్కువ సేపు ఫోన్ వాడే వాళ్లకు ఇది వేడెక్కకుండా ఉండేందుకు 6000mm² వేపర్ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు. అలాగే, 7550mAh భారీ బ్యాటరీ కూడా ఈ ఫోన్ స్పెషాలిటీ. దీన్ని కేవలం కొన్ని నిమిషాల్లోనే ఛార్జ్ చేసేందుకు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫీచర్లు చూస్తుంటే పోకో ఎఫ్7 పర్ఫార్మెన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తయారు చేశారని అర్థమవుతోంది.

Also Read:  One Plus : వన్‌ప్లస్ సేన్సేషన్.. ఫోన్ డిస్‌ప్లేపై లైఫ్ టైం వారంటీ

పోకో విడుదల చేసిన ఒక పోస్టర్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.35,000 లోపే ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. ఇంత తక్కువ ధరలో స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 లాంటి హై-ఎండ్ ప్రాసెసర్‌తో వస్తుండడం విశేషం. ఇది త్వరలో రాబోయే నథింగ్ ఫోన్ 3కి కూడా గట్టి పోటీ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే నథింగ్ ఫోన్ 3 కూడా ఇదే ప్రాసెసర్‌తో వస్తున్నా, ధర మాత్రం ఎక్కువగా ఉండొచ్చు.

ఫీచర్ల విషయానికొస్తే.. పోకో ఎఫ్7లో 6.83-అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే ఉండొచ్చు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే, 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వరకు సపోర్ట్ చేయగలదు. ధూళి, నీటి నుంచి రక్షించేందుకు IP68 రేటింగ్ కూడా ఈ ఫోన్‌కు ఉండొచ్చని సమాచారం. కెమెరా విషయానికి వస్తే.. వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉండొచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత షియోమీ హైపర్‌ఓఎస్ 2 పై పని చేయనుంది. మొత్తంగా, పోకో ఎఫ్7 మంచి పర్ఫార్మెన్స్, ఆకర్షణీయమైన ఫీచర్లతో రూ.35,000 లోపు ధరలో మార్కెట్లోకి రావడం, వినియోగదారులకు మంచి ఆప్షన్ అవుతుందని చెప్పొచ్చు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular