Pixelcut Magic Eraser: ఒక్క ఫొటో చరిత్ర చెబుతుందని అంటారు. కొందరు తమ గుర్తుల కోసం ఫొటోలను తీసుకొని జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఆ ఫొటో చూసినప్పుడల్లా వారి పాత రోజులు గుర్తుకు వస్తుంటాయి. ఒకప్పుడు ఫొటోను కెమెరాతో తీసేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో ఫొటో తీయడానికి ఇప్పుడు ప్రత్యేకంగా కెమెరా అవసరం లేకుండా పోయింది. మొబైల్ లోనే లార్జ్ పిక్సెల్ తో పిక్స్ తీసుకోవచ్చు. అయితే ఫొటో అందంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. కొందరు ఫొన్ కెమెరా బాగున్నా ఫొటో తీయడంలో పొరపాట్లు చేస్తారు. ఈ పొరపాట్లను ఓ యాప్ ద్వారా సరిచేసుకోవచ్చు.
విహార యాత్రలకు వెళ్లినప్పుడు తప్పకుండా ఫొటోలు దిగుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఫొటో దిగేటప్పుడు మనుషులు అడ్డం వస్తుంటారు. అలాగే కొన్ని సీన్స్ బాగుంటాయి. కానీ అక్కడ ఫొటో తీసుకోలేం. అలాగే ఇతరులను ఫొటో తీసినప్పుడు మనం అనుకున్న విధంగా పిక్ రాదు. ఇలాంటి సమయంలో ఓ యాప్ ద్వారా మనకు ఫొటో ఎలాగంటే అలా మార్చుకోవచ్చు. అసరం లేని కొన్ని సీన్లను తీసేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
గూగుల్ లోకి వెళ్లి… Pixelcut magic eraser అని టైప్ చేయండి. ఇప్పుడు వచ్చిన ఫస్ట్ వెబ్ సైట్ ని ఓపెన్ చేయాలి. ఆ తరువాత అందులో మనం ఎలాంటి ఫొటో ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ పిక్ ను అప్లోడ్ చేయాలి. ఆ తరువాత మనకు అవసరం లేని వాటిని రిమూవ్ చేయొచ్చు. అంతేకాకుండా కొన్ని ఫొటోల్లో అవసరం లేని వ్యక్తుల ఉంటారు. వారిని కూడా ఈజీగా తీసేయవచ్చు. ఇలా ఎడిట్ చేసిన పిక్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా మంది ఫొటో ఎడిట్ కోసం ఫొటో షాప్ వాడుతూ ఉంటారు. అయితే అందరి వద్ద ఈ సాప్ట్ వేర్ ఉండకపోవచ్చు. అందువల్ల మొబైల్ లోనే ఇలా ఫొటోను ఎడిట్ చేసుకోవచ్చు.