OnePlus : స్మార్ట్ ఫోన్ మార్కెట్లో వన్ ప్లస్ కంపెనీకి చెందిన ఫోన్లకు మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ ను ఆసరాగా తీసుకుని కంపెనీ ఎప్పటికప్పడు అత్యాధునిక ఫీచర్లలో.. కొత్త మోడళ్లను మార్కెట్లోకి లాంచ్ చేస్తుంది. అలా OnePlus Nord CE4 5G ఫోన్ మార్కెట్లో త్వరలోనే సందడి చేయనుంది. ఈ 5జి స్మార్ట్‌ఫోన్ కెమెరా ఇప్పటి వరకు వచ్చిన వాటికంటే చాలా మెరుగ్గా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇది HD క్వాలిటీతో ఫోటోలు, వీడియోలను రికార్డ్ చేయడానికి 400 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. సెల్పీల కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా మరింత అద్భుతంగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ వివిధ కొత్త ఫీచర్లను కలిగి ఉంది. వన్ ప్లస్ 5జి స్మార్ట్‌ఫోన్‌లో ఇవ్వబడిన డిస్‌ప్లే మరింత మెరుగ్గా ఉంది. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో డిస్‌ప్లే స్క్రీన్ 6.72 అంగుళాలు, 120Hz రిఫ్రెష్ రేట్, 1080 × 3236 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది . కస్టమర్లకు ఆకర్షించే విధంగా ప్రీమియం ఫీచర్లతో రానుంది. సుదీర్ఘ బ్యాటరీ లైఫ్, అద్భుతమైన కెమెరా వినియోగదారులను ఆకర్షిస్తుంది.
కెమెరా
OnePlus Nord CE4 5G ఈ కొత్త మొబైల్ ఫోన్ కెమెరా గురించి చెప్పాలంటే.. ఈ మొబైల్ ఫోన్‌లో ఇవ్వబడిన కెమెరా చాలా బాగుంది. ఈ ఫోన్ కెమెరా 400MP గా ఇవ్వబడింది ఈ 5G స్మార్ట్‌ఫోన్‌లో బ్రాడ్ షాట్‌ల కోసం 64MP అల్ట్రా-వైడ్ లెన్స్, జూమ్ షాట్‌ల కోసం 16MP టెలిఫోటో లెన్స్ కెమెరాలతో రానుంది. సెల్పీల కోసం 50MP మెగాపిక్సెల్స్ కెమెరాను కంపెనీ అందించంది. వీటితో HD నాణ్యతలో ఫోటోలు, వీడియోలను రికార్డ్ చేయవచ్చు. ఈ కెమెరా సిస్టమ్ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడేలా రూపొందించబడింది. ల్యాండ్‌స్కేప్ షాట్‌ల నుండి వెరీ క్లోజప్‌ల వరకు ప్రతిదాన్ని అందంగా చిత్రీకరించవచ్చు.
బ్యాటరీ, ఛార్జింగ్
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు బ్యాటరీ జీవితం చాలా ముఖ్యమైనది. Nord CE4 5G సుదీర్ఘ కాలం పని చేసే బ్యాటరీతో వస్తుంది. దీనిలో 7300mAh బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీని ఛార్జింగ్ కూడా చాలా వేగంగా ఉంటుంది. అందుకోసం 120W ఫాస్ట్ ఛార్జర్ కూడా అందించబడుతుంది. బ్యాటరీ పూర్తిగా చార్జ్ కావడానికి 50నిమిషాల సమయం పడుతుంది. ఒకసారి బ్యాటరీ చార్జింగ్ పెడితే రోజంతా వస్తుంది.
స్టోరేజ్, RAM
కస్టమర్ల అవసరాల నిమిత్తం ఈ స్మార్ట్ ఫోన్ డివైజ్ మూడు వేరియంట్‌లతో లాంచ్ అవుతుందని కొందరు చెబుతున్నారు.
8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్
12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్
16GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్
అంచనా ధర
OnePlus Nord CE4 5G స్మార్ట్ ఫోన్ ధర : రూ.29,999 నుండి రూ.34,999 ఉంటుందని అంచనా. లాంచ్ ఆఫర్ కింద రూ.1,000 నుండి రూ.2,000 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ జనవరి లేదా ఫిబ్రవరి 2025లో లాంచ్ అవుతుందని అంచనా.