https://oktelugu.com/

కొత్త స్కూటర్ కొనేవాళ్లకు శుభవార్త.. రూ.500తో స్కూటర్ బుకింగ్..?

కొత్తగా స్కూటర్ ను కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు ఓలా అదిరిపోయే శుభవార్త చెప్పింది. కంపెనీ వెబ్ సైట్ ద్వారా తక్కువ ధరకే స్కూటర్ ను బుకింగ్ చేసుకునే అవకాశాన్ని అయితే కంపెనీ కల్పించింది. ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్ ను ప్రారంభించగా కేవలం 499 రూపాయలతో స్కూటర్ ను బుకింగ్ చేసుకోవచ్చు. ఈ మొత్తం రిఫండబుల్ అమౌంట్ కావడం గమనార్హం. ఈ విధంగా వెబ్ సైట్ ద్వారా స్కూటర్ ను ప్రిబుకింగ్ చేసుకోవచ్చు. ఎవరైతే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 16, 2021 / 09:55 AM IST
    Follow us on

    కొత్తగా స్కూటర్ ను కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు ఓలా అదిరిపోయే శుభవార్త చెప్పింది. కంపెనీ వెబ్ సైట్ ద్వారా తక్కువ ధరకే స్కూటర్ ను బుకింగ్ చేసుకునే అవకాశాన్ని అయితే కంపెనీ కల్పించింది. ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్ ను ప్రారంభించగా కేవలం 499 రూపాయలతో స్కూటర్ ను బుకింగ్ చేసుకోవచ్చు. ఈ మొత్తం రిఫండబుల్ అమౌంట్ కావడం గమనార్హం. ఈ విధంగా వెబ్ సైట్ ద్వారా స్కూటర్ ను ప్రిబుకింగ్ చేసుకోవచ్చు.

    ఎవరైతే 499 రూపాయలతో స్కూటర్ ను ప్రి బుకింగ్ చేసుకుంటారో వారికి ఎలక్ట్రిక్ స్కూటర్లను ముందుగా డెలివరీ చేయడం జరుగుతుంది. ఇతర స్కూటర్లతో పోలిస్తే ఈ స్కూటర్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్కూటర్ కోసం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ఉండగా ఈ స్కూటర్ ను సులభంగా కీ అవసరం లేకుండానే ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కూటర్ ను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు.

    అయితే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి ఏకంగా 6 గంటల సమయం పడుతుందని సమాచారం. ఓలా ఈ స్కూటర్ కొరకు దేశంలో 400 ప్రధాన పట్టణాలలో హైపర్ చార్జర్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్టు కీలక ప్రకటన చేసింది. ఈ స్కూటర్ పై గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ఈ స్కూటర్ ధర ఎంతో తెలిసే అవకాశం అయితే ఉంటుంది.

    దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్లపై దృష్టి పెడుతున్నారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.