
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు సూచీల పరుగును కట్టడి చేస్తున్నాయి. ఉదయం 9.27 గంటల సమయంలో సెన్సెక్స్ 56 పాయింట్ల లాభంతో 53,215వద్ద నిఫ్టి 23 పాయింట్లు లాభపడి 15,947 వద్ద కొనసాగుతున్నాయి. దీంతో సూచీలు తాజా గరిష్ఠాలకు చేరాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.54 వద్ద ట్రేడవుతోంది.