Nokia 5G Keypad Phone: చేతిలోకి మొబైల్ వచ్చిన కొత్తలో Nokia ప్రభంజనం సృష్టించింది. కాల్స్ చేసుకోవడంతోపాటు మెసేజ్ పంపించుకోవడానికి నోకియా 1100 అప్పట్లో చాలామంది సొంతం చేసుకునేవారు. ఈ మొబైల్ ఉన్నవారిని కాస్త ప్రత్యేకంగా చూసేవారు. అంతేకాకుండా ఇది కొందరి వద్ద మాత్రమే ఉండేది. అయితే ఆ తర్వాత డిజిటల్ విప్లవం ఏర్పడిన తర్వాత స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చి కీప్యాడ్ ఫోన్ కనుమరుగై పోయింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో.. చదువుకొని వారు కీప్యాడ్ ఫోను ఇంకా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వినియోగిస్తున్నప్పటికీ కొందరు కీప్యాడ్ ఫోన్ పై మక్కువ తగ్గించుకోవడం లేదు. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలు కీప్యాడ్ మొబైల్స్ కూడా అప్డేట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా లేటెస్ట్ గా నోకియా కంపెనీ 5g కీప్యాడ్ ఫోన్ ను అప్డేట్ చేసి మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
స్మార్ట్ ఫోన్ ప్రభంజనం సృష్టిస్తున్నప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో కీప్యాడ్ ఫోన్ కు ఆదరణ తగ్గడం లేదు. చాలామంది ఈ రకమైన ఫోన్లను ఇప్పటికీ వాడుతున్నారు. అయితే ఇందులోనూ లేటెస్ట్ మొబైల్స్ కోరుకునే వారు ఉన్నారు. వీరిని ఆకర్షించుకునేందుకు నోకియా లేటెస్ట్ గా 5g కీప్యాడ్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. ఇది ఆపరేటింగ్ వరకు మాత్రమే కీప్యాడ్.. మిగతావన్నీ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఇందులోని కెమెరా 108 MP తో పనిచేస్తుంది. దీంతో ఈ ఫోన్ ద్వారా కావలసిన ఫోటోలను తీసుకోవచ్చు. అలాగే వీడియోలు కూడా రికార్డు చేసుకోవచ్చు.
ప్రస్తుతం వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్స్ బ్యాటరీ ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి ఇబ్బందులు కలిగిస్తుంది. అయితే ఇలాంటి వారు కీప్యాడ్ ఫోన్ ను వాడడం వల్ల బ్యాటరీ సేవ్ అయ్యే అవకాశం ఉంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన 5g కీప్యాడ్ ఫోన్లో 6,000 mAh బ్యాటరీని చేర్చారు. దీంతో రోజంతా వినియోగించే వారితోపాటు రెండు మూడు రోజులపాటు బ్యాటరీ సేవ్ చేసుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది.
అలాగే ఇది కీప్యాడ్ ఫోన్ అయినప్పటికీ… చూడడానికి ఆకర్షణీయంగా ఉండేలా డిజైన్ తయారు చేశారు. స్మార్ట్ ఫోన్ తలపించేలా స్క్రీన్ ను పెద్దదిగా ఉంచారు. ఈ స్క్రీన్ పై ఫేస్బుక్, వాట్సాప్ వంటి యాప్స్ చూడవచ్చు. వీటిని కీప్యాడ్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఇందులో 5g నెట్వర్క్ కనెక్టివిటీ ఆప్షన్ ఉండడంతో ప్రస్తుతం ఎక్కడికి వెళ్లినా ఈ ఫోన్ కావాల్సిన ఇంటర్నెట్ను అందిస్తుంది. ఇక ఇందులో డిస్ప్లే కూడా ఆకట్టుకునేలా ఉంది. కొన్ని వీడియోస్ తో పాటు సినిమాలు కూడా చూసే అవకాశం ఉంది. సాధారణ వెబ్సైట్ ఓపెన్ చేసే వారికి ఇది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ మొబైల్ ను రూ.1,599 నుంచి విక్రయించే అవకాశం ఉంది.