Smartphone Updates: మీరు స్మార్ట్‌ఫోన్ కొని నాలుగేళ్లు దాటిందా.. ఫోన్ మంచి కండీషన్‌లో ఉందా.. ఒక గీత కూడా పడలేదా.. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుందా.. దీంతో పాత ఫోన్‌నే కొనసాగిస్తున్నారా.. చాలా మంది ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ఇలాగే చేస్తున్నారు. బెస్ట్ ఆఫర్స్ వచ్చినప్పుడు ఫోన్ కొనొచ్చు అనుకుని ఏళ్లకు ఏళ్లు అప్‌డేట్స్ లేని ఫోన్లనే వాడుతున్నారు. అయితే అప్‌డేట్స్ రానికారణంగా కొన్ని సమస్యలు వస్తాయి. అయితే అప్‌డేట్స్ లేకుండా కూడా ఫోన్‌ను వినియోగించవచ్చు. అయితే కొన్ని సూచనలు పాటించాలంటున్నారు టెక్ నిపుణులు.
రెండు రకాల అప్‌డేట్స్..
స్మార్ట్ ఫోన్‌వాడే వారికి రెండు రకాల అప్‌డేట్స్ వస్తాయి. వాటిలో ఒకటి ఆండ్రాయిడ్ అప్‌డేట్.. రెండోది సెక్యూరిటీ అప్‌డేట్స్. స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు దాదాపు ఏడాదికోసారి ఓఎస్ అప్‌డేట్స్ విడుదల చేస్తాయి. దీనికి ఒకటికన్నా ఎక్కువ జీబీ డేటా అవసరం అవుతుంది. సెక్యూరిటీ అప్‌డేట్స్(Securites Updates) అనేవి నెలనెలా వస్తుంటాయి. వీటనికి కొన్ని ఎంబీల డేటా అవసరం. యాపిల్ కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ రిలీజ్ చేస్తుంది. స్మార్ట్‌ఫోట్ కంపెనీలు ఓఎస్‌ను అప్‌డేట్ ఆపేసిన కొన్నాళ్లకు సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా ఆగిపోతాయి. అయితే అప్‌డేట్స్ వస్తున్నా డేటా ఖర్చవుతుందని చాలా మంది వదిలేస్తున్నారు. వారు ఈ విషయాలు తెలుసుకోవాలి.
ఆండ్రాయిడ్ అప్డేట్స్
కొత్త కొత్త ఫీచరల్తో గూగుల్ సంస్థ ఓఎస్ అప్‌డేట్ విడుదల చేస్తుంది. ప్రస్తుతం పోన్లన్నీ ఆండ్రాయిడ్ 15తో వస్తున్నాయి. చాలా ఫోన్లలో ఆండ్రాయిడ్ 14 నడుస్తోంది. అప్‌డేట్ చేసుకున్న ప్రతీసారి కొత్త లుక్, ఫీచర్లు యూజర్లను పలకరిస్తాయి. గూగుల్ రిజీల్ చేసిన ఓఎస్ అప్‌డేట్‌ను మొబైల్ తయారీ కంపెనీలు తమ యూఐకి అనుగునంగా చిన్నచిన్న మార్పులతో విడుదల చేస్తాయి. శాంసంగ్ అయితే వనియూఐ, వన్స్ అయితే ఆక్సిజన్ ఓఎస్, షామోవీ అయితే హైపవర్ ఓఎస్ ఇస్తాయి. గతంలో ఒకటి రెండు అప్‌డేట్స్ మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు నాలుగైదు అప్‌డేట్స్ కంపెనీలు ఇస్తున్నాయి. పిక్సల్ ఫోన్లకు దాదాపు ఏడేళ్లపనాటు గూగుల్ ఓఎస్(OS) అప్‌డేట్ వస్తుంది. శాంసంగ్, యాపిల్ సంస్థలు సైతం ఫోన్లను బట్టి ఐదారేళ్లు ఓఎస్ అప్‌డేట్స్ ఇస్తాయి.
అప్‌డేట్స్ ఆగిపోతే..
కంపెనీ హామీ ఇచ్చిన ఓఎస్ అప్‌డేట్స్ అయిపోయాక కొత్తగా ఎలాంటివి రావు. అంతమాత్రాన ఫోన్ పనిచేయకుండా ఏమీ ఆగిపోదు. కానీ, ఆండ్రాయిడ్‌లో వచ్చే కొత్త కొత్త ఫీచర్లు నిలిచిపోతాయి. ఇంకా కొన్నాళ్లు ఆగిఇతే యాప్ డెలపర్లు పాత ఫోన్లకు తమ సపోర్టును నిలిపివేస్తాయి. వాట్సాప్ వంటి సంస్థలు ఏటా సపోర్టును నిలిపివేసే ఫోన్ల జాబితాను విడుదల చేస్తుంటాయి. ఎస్‌బీఐ(SBI) సైతం తాజాగా ఆండ్రాయిడ్ 12కు ముందు ఉన్న వెన్షన్లకు సపోర్ట్‌ను నిలిపివేసింది. ఇలా ఫీచర్స్ పొందలేకపోతాం.
సెక్యూరిటీ అప్డేట్స్
దీర్ఘకాలం ఫోన్‌ను ఎలాంటి అవాంతరాలు లేకుండా వాడుకోవాలంటే సెక్యూరిటీ అప్‌డేట్స్ కీలకం. గూగుల్(Google) నెలవారీ సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను విడుదల చేస్తుంది. భద్రతాపరమైన లోపాలు తలెత్తినప్పుడు మధ్యలో కూడా ఈ సెక్యూరిటీ అప్‌డేట్స్ వస్తుంటాయి. సాధారణంగా ఓఎస్ అప్‌డేట్స్ ఆగిపోయిన ఒకటిరెండేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ కొనసాగుతాయి. మీ ఫోన్‌కు ఎన్నేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్ కొనసాగిస్తామనేది ఫోన్ కొనుగోలు చేసే సమయంలోనే కంపెనీ చెబుతుంది.
నిలిచిపోతే..?
సైబర్ నేరాలు పెరిగిన నేపథ్యంలో ఆర్థిక మోసాల నుంచి రోఇంచుకోవడానికి ఈ స ఎక్యూరిటీ అప్‌డేట్స్ చాలా కీలకం. డేటా చౌర్యం, హ్యాక్‌లు, సైబర్ దాడుల నుంచి రక్షించుకోవడంలో వీటిదే కీలక పాత్ర. సైబర్ నేరగాళ్లు వివిధ రూపాల్లో చేసే దాడుల నంచి ఈ సెక్యూరిటీ అప్‌డేట్స్ కాపాడతాయి. ఈ సెక్యూరిటీ అప్‌డేట్స్ నిలిచిపోయినా వాటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడంలో విఫలమైనా సైబర్ నేరగాళ్లకు స్వయంగా మనమే ద్వారాలు తెచిరినట్లవుతుంది.