Mars : అంగారకుడిపై నీటి ప్రవాహం ఉండేది… తిరుగులేని సాక్ష్యం చూపించిన నాసా!

Mars : ఈ విశ్వంలో భూమిపై కాకుండా ఇంకెక్కడైనా విశ్వం ఉందంటే అది కేవలం ‘అంగారక’ గ్రహంపై మాత్రమే. ఎందుకంటే భూమి తర్వాత ఉండే ఈ గ్రహం ఆనవాళ్లు చూస్తే అక్కడ గాలి ఉన్నట్టుగా.. ఇదివరకూ నదులు పారినట్టుగా కనిపిస్తుంది. శాస్త్రవేత్తలు కూడా భూమికి సోదర గ్రహం అంగారుకుడేనని.. అక్కడ జీవం ఖచ్చితంగా ఉండి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం నాసా సహా భారతదేశం వంటి దేశాలు అక్కడికి రోవర్లు, ఉపగ్రహాలను పంపి శూలశోధన చేపట్టాయి. తాజాగా అమెరికన్ […]

Written By: NARESH, Updated On : August 27, 2022 8:21 pm
Follow us on

Mars : ఈ విశ్వంలో భూమిపై కాకుండా ఇంకెక్కడైనా విశ్వం ఉందంటే అది కేవలం ‘అంగారక’ గ్రహంపై మాత్రమే. ఎందుకంటే భూమి తర్వాత ఉండే ఈ గ్రహం ఆనవాళ్లు చూస్తే అక్కడ గాలి ఉన్నట్టుగా.. ఇదివరకూ నదులు పారినట్టుగా కనిపిస్తుంది. శాస్త్రవేత్తలు కూడా భూమికి సోదర గ్రహం అంగారుకుడేనని.. అక్కడ జీవం ఖచ్చితంగా ఉండి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం నాసా సహా భారతదేశం వంటి దేశాలు అక్కడికి రోవర్లు, ఉపగ్రహాలను పంపి శూలశోధన చేపట్టాయి.

తాజాగా అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా రోవర్ అద్భుతమైన ఫొటోలను భూమిపైకి పంపింది. అవి చూస్తే అక్కడ నీటి జాడలు ఒకప్పుడు ఉండేవని అర్థమవుతోంది. అంగారక గ్రహంలోని జెజెరో క్రేటర్‌లో అద్భుతమైన మార్టిన్ శిలలను కనుగొంది. అవి జీవానికి సంబంధించిన జాడలను కలిగి ఉండవచ్చని తెలిపింది. అంగారక ఉపరితలం ఒకప్పుడు నీటితో నిండి ఉండేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ రాళ్ళు, నీటి ద్వారా రాపిడికి గురైనట్లు స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయని నమ్ముతారు. ఈ రెడ్ ప్లానెట్ నిజానికి ఒకప్పుడు నీటితో ఉండేదన్న శాస్త్రవేత్తల అనుమానాలకు ఇది బలం చేకూర్చేలా ఉంది. సేకరించిన శిలల నమూనాలను రోబోట్ భద్రపరిచింది. భూమికి వచ్చే ముందర ఈ శిలలను తీసుకువస్తుంది.

పురాతన సరస్సు, నదీ నిక్షేపాలను పరిశోధించడానికి జెజెరో క్రేటర్‌లోకి రోవర్ ల్యాండింగ్ నాసా చేసింది. 28 మైళ్లు (45 కిలోమీటర్లు) వెడల్పు గల ఈ బిలం ఇసిడిస్ ప్లానిషియా యొక్క పశ్చిమ అంచున ఉంది. ఇది మార్టిన్ భూమధ్యరేఖకు కొద్దిగా ఉత్తరాన ఉన్న ఒక ఫ్లాట్ మైదానం. ఇది గేల్ క్రేటర్‌లో క్యూరియాసిటీ ల్యాండింగ్ ప్రదేశం నుండి దాదాపు 2,300 మైళ్ళు (3,700 కిలోమీటర్లు) దూరంలో ఉంది.

జెజెరో క్రేటర్, మార్స్ ఉపరితలంపై సజలంగా మార్చబడిన అగ్నిశిలలు కనుగొన్నది పేర్కొన్నారు. ఈ పరిశోధనలో రెండు వేర్వేరు రకాలైన ఇగ్నియస్ శిలలు నిపుణులను ఆశ్చర్యపరచాయి. ఈ శిలల్లో సల్ఫేట్‌లు మరియు పెర్క్లోరేట్‌లను కలిగి ఉంటాయి, ఇవి ఉపరితలానికి సమీపంలోని సెలైన్ బాష్పీభవనం ద్వారా సృష్టించబడి ఉండవచ్చు అని అధ్యయనం తెలిపింది. నాసా ప్రకారం, 2021 ఫిబ్రవరిలో మార్స్ రోవర్ జెజెరో క్రేటర్ నేలపై రాళ్లను పరిశీలించడం ప్రారంభించినప్పుడు.. నీటితో రాపిడి కలిగినట్టున్న రాళ్లు శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగించాయి..

శుక్రవారం ట్విట్టర్‌లో నాసా రోవర్ అధికారిక హ్యాండిల్ ద్వారా రాళ్ల చిత్రాలతో పాటు ఒక పోస్ట్ చేశారు. ” జెజెరో క్రేటర్ పురాతన సరస్సులో చాలా అవక్షేపణ శిలలను ఆశించాం. వాటిని ఇప్పుడు పాత నది డెల్టా వద్ద చూస్తున్నాం. కానీ క్రేటర్ ఫ్లోర్ లోని రాళ్లు అగ్నిపర్వత శిలలు. ఇవి ఖచ్చితంగా అంగారకుడిపై నీటి రాపిడికి గురయ్యాయని’ నాసా తెలిపింది. దీన్ని బట్టి ఒకప్పుడు అంగారక గ్రహం కూడా సముద్రాలు, నీటితో కళకళలాడేదన్న అనుమానాలకు బలం చేకూర్చే విధంగా ఉంది. మన భూమితోపాటు సోదర గ్రహంపై కూడా జీవం ఉంటే ఇక అంతకంటే మనిషికి నివాసయోగ్యమైన మరో గ్రహం మరొకటి ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదు.

https://twitter.com/NASAPersevere/status/1562884263023763456?s=20&t=sj4oDqRiJVVhaTzO19bxdA