NASA farming experiment space: సారవంతమైన భూమి.. సమృద్ధిగా నీటి వనరులు.. విస్తృతంగా ఎరువులు వేస్తేనే ఈ భూమ్మీద పంటలు అంతంత మాత్రమే పండుతున్నాయి. మన దేశానికి సరిపడా పండ్లను, ఇతర వస్తువులను వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులను కల్పిస్తున్నాయి. ఈ భూమ్మీదే అంతంతమాత్రంగా పంటలు పండుతున్న వేళ.. ఆకాశంలో అది కూడా అంతరిక్షంలో పంటలు పండించవచ్చా..
అంతరిక్షంలో పంటలు పండించడానికి వాతావరణం అనుకూలించదు. ఎందుకంటే అక్కడ భూమి మీద ఉన్నట్టుగా సూర్యరశ్మి ఉండదు. వాతావరణ కూడా అనుకూలంగా ఉండదు. ఇక నీటి సౌకర్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆక్సిజన్, ఇతర వాయువుల లభ్యత అక్కడ అత్యంత తక్కువగా ఉంటుంది. అయితే అలాంటి చోట పంటలు పండించడం దాదాపు అసాధ్యం. అసలు అక్కడ ఆక్సిజన్ సిలిండర్లు లేకుండా ఆస్ట్రోనాట్స్ బతకడమే కష్టం. అలాంటి చోట పంటలు ఎలా పండుతాయి? అసలు వాటిని పండించడానికి ఎటువంటి వాతావరణం సృష్టించాలి? అసలు అక్కడ అలాంటి వాతావరణం సృష్టించడానికి సాధ్యమవుతుందా? ఒకవేళ ఇవన్నీ సాధ్యమైతే ఎలాంటి పంటలు పండించవచ్చు? ఇప్పుడు ఈ ప్రశ్నలకు ఇటీవలి అధ్యయనాలు స్పష్టమైన సమాధానం చెబుతున్నాయి.
Also Read: Makhana : మఖానా వ్యవసాయానికి పెరుగుతున్న డిమాండ్.. తక్కువ ఖర్చుతో లక్షల్లో లాభాలు…
అంతరిక్షంలో అనేక ప్రయోగాలు జరుగుతుంటాయి. అనేక దేశాలు రకరకాల ఉపగ్రహాలను ప్రయోగిస్తుంటాయి.. అయితే ఈ ఉపగ్రహాలు మాత్రమే కాకుండా అంతరిక్షంలో మరో విధమైన ప్రయోగాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లే వ్యోమగాములకు సరిపడా ఆహారాన్ని ముందుగానే ప్రాసెస్ చేసి పంపిస్తుంటారు. అయితే ఇందులో అన్ని రకాల ఖనిజ లవణాలు ఉండే విధంగా చూసుకుంటారు. అయితే అంతరిక్షంలోకి వెళ్లే ఆస్ట్రోనాట్స్ సొంతంగా ఆహారం తయారుచేసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ పంటలు పండించడానికి అనువైన వాతావరణం ఉండదు. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిశోధనల ప్రకారం ఆస్ట్రోనాట్స్ తమకు అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే మొక్కల నుంచి అంతరిక్షంలో ఆక్సిజన్ వెలుబడుతుంది. అంతరిక్షంలో సూర్యరశ్మి, నీరు, ఆక్సిజన్, భూమి వంటివి లేకపోయినప్పటికీ అక్కడ మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయని ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో తేలింది. అయితే ఆ మొక్కలు ఫలాలు ఇస్తాయా? పత్రాలు తినడానికి ఉపయోగపడతాయా? అనే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.. ప్రస్తుతానికి అయితే ఈ పరిశోధనలు ప్రయోగదశలో ఉన్నాయి. ఎటువంటి అనువైన వాతావరణం లేకపోయినప్పటికీ ఈ మొక్కలు ఏపుగా పెరగడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఈ మొక్కలు ఆహారానికి పనికి రాకపోతే.. వాటి స్థానంలో ఇతర మొక్కలను పెంచే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
Also Read: Blue Moon 2023: బ్లూమూన్ ఎలా ఏర్పడుతుంది? ఆ సమయంలో ఏం జరుగుతుంది?
ఇవన్నీ కూడా ప్రయోగ దశలోనే ఉన్నాయి. ప్రయోగ దశ దాటి.. అవన్నీ ఫలితాన్ని గనుక ఇస్తే.. భవిష్యత్తు కాలంలో అంతరిక్షంలోకి వెళ్లే ఆస్ట్రోనాట్స్ ప్రాసెస్ ఫుడ్ తీసుకొని వెళ్లాల్సిన అవసరం లేదు. అంతరిక్షంలోనే వారు ఆహారం తయారుచేసుకునే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండి మరిన్ని ప్రయోగాలు చేయడానికి వీలు కలుగుతుంది. అంతరిక్షంలో ఒకవేళ విపత్కర పరిస్థితి ఏర్పడి ఆహారం తయారు చేసుకోలేకపోతే.. భూమ్మీద నుంచి ప్రాసెస్ ఫుడ్ తీసుకువెళ్లే సౌలభ్యం కూడా ఉంది. అందువల్లే అంతరిక్ష ప్రయోగాలకు వెళ్లే సమయంలో ఆస్ట్రోనాట్స్ కచ్చితంగా ప్రాసెస్ ఫుడ్ తీసుకెళ్తుంటారు. అక్కడ అదే ఆహారాన్ని తింటూ వారు జీవితాన్ని సాగిస్తుంటారు.