https://oktelugu.com/

Mega DSC In Telangana: తెలంగాణలో మెగా డీఎస్సీ.. 11 వేలకుపైగా పోస్టులతో నోటిఫకేషన్‌.. పూర్తి వివరాలివీ*

గతంలో 5 వేల పోస్టులతోనే బీఆర్‌ఎస్‌ సర్కార్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కారణంగా పరీక్ష జరుగలేదు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ప్రభుత్వం వాటిని కలుపుకుని 11,060 పోస్టులతో నోటిఫికేషన్‌ ఇవ్వాలని భావిస్తోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : February 27, 2024 / 02:44 PM IST

    Mega DSC In Telangana

    Follow us on

    Mega DSC In Telangana: తెలంగాణ నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇటీవలే 670 పోస్టులతో గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ ద్వారా విడుదల చేసింది. తాజాగా ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై దృష్టిపెట్టింది. ఈమేరకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వారంలో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది.

    11 వేలకుపైగా పోస్టులు..
    గతంలో 5 వేల పోస్టులతోనే బీఆర్‌ఎస్‌ సర్కార్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కారణంగా పరీక్ష జరుగలేదు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ప్రభుత్వం వాటిని కలుపుకుని 11,060 పోస్టులతో నోటిఫికేషన్‌ ఇవ్వాలని భావిస్తోంది. ఈమేకు ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి కూడా ప్రకటన చేశారు. తాజాగా 11,060 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం కూడా లభించింది.

    గతంలో ఇలా..
    గతేడాది ఆగస్టులో 5,089 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ జారీ చేసింది. ఇందులో 2,575 ఎస్జీటీ పోస్టులు, 1,739 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. 611 లాంగ్వేజ్‌ పండిత్, 164 పీఈటీ పోస్టులు కూడా ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ నోటిఫికేషన్‌ రద్దు చేసి పోస్టులు పెంచి నోటిఫికేషన్‌ ఇవ్వనుంది.

    ఎన్నికల షెడ్యూల్‌కు ముందే..
    మార్చి రెండో వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తే నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశం ఉండదు. దీంతో షెడ్యూల్‌కు ముందే నోటిఫికేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా విద్యాశాఖ చకచకా ఏర్పాట్లు చేస్తోంది.