Music to reduce road accidents : సాధారణంగా విశాలమైన రోడ్లమీద ఎవరైనా సరే వేగంగా వెళుతూ ఉంటారు. కానీ ఆ వేగం అదుపు తప్పితేనే అసలు సమస్య ఎదురవుతుంది. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలన్నీ కూడా అధిక వేగం వల్లే. ఓ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో లక్షల మంది చనిపోతున్నారని తెలుస్తోంది. అంతకు రెట్టింపు సంఖ్యలో క్షతగాత్రులు అవుతున్నారని సమాచారం. అయితే ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ని రకాల చర్యలు చేపట్టినప్పటికీ ఉపయోగం ఉండడం లేదు. దీనిపై ప్రభుత్వాలు ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నప్పటికీ ప్రయోజనం లభించడం లేదు. అయితే చివరికి రోడ్డు ప్రమాదాల నివారణకు హంగరి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దానిని అమల్లో కూడా పెట్టింది. ఇంతకీ ఆ దేశం ఎలాంటి చర్యలు తీసుకుందంటే..
సంగీతానికి రాళ్లు కూడా పరవశించిపోతాయని చిన్నప్పుడు పుస్తకాల్లో మనం చదువుకున్నాం కదా.. ఇప్పుడు హంగరీ ప్రభుత్వం ఆ సూక్తిని అమలులో పెట్టింది. ఎంతటి పాషాణ హృదయుడికైనా సంగీతం అనేది సాంత్వన కలిగిస్తుంది. ఆనందాన్ని అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది. మానసిక ప్రశాంతతను కలిగేలా చేస్తుంది. కానీ సంగీతం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గిపోతాయని.. డ్రైవర్లలో అప్రమత్తత పెరుగుతుందని ఎప్పుడైనా మీరు అనుకున్నారా.. కానీ ఇదే ఆలోచన హంగరి ప్రభుత్వానికి వచ్చింది. రావడమే కాదు ఏకంగా అమల్లో కూడా పెట్టింది. హంగరి దేశంలో రోడ్డు మార్గాలు ఎక్కువగా ఉంటాయి. అయితే విశాలమైన రోడ్లు ఉండడంవల్ల . ప్రమాదాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. వాటిని నివారించడానికి హంగరీ ప్రభుత్వం ప్రత్యేకంగా రోడ్ల పక్కన వైట్ స్ట్రిప్స్ డిజైన్ చేస్తోంది.. ఈ స్ట్రిప్స్ మీదుగా వాహనం నిర్దిష్ట ప్రమాణానికి మించి వేగంతో వెళితే అవి సంగీతాన్ని ప్లే చేస్తుంటాయి. మనోరంజకమైన సంగీతం వినిపించడంతో డ్రైవర్లు వేగాన్ని తగ్గించుకుంటారు. తద్వారా తాము తోలే వాహనంపై అదుపు పెంచుకుంటారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గిపోతుంది..” రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి ఏడాది వేలాది మంది చనిపోతున్నారు. అంతకుమించి సంఖ్యలో గాయపడుతున్నారు. దీనివల్ల దేశంలో ఒక రకమైన విషాదం ఏర్పడుతున్నది. దానిని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం. వైట్ స్ట్రిప్స్ కు సంగీతం వచ్చేలాగా ఏర్పాటు చేయడంతో వాహనాలను తోలే డ్రైవర్లు వేగాన్ని తగ్గించుకుంటున్నారు. తద్వారా వాహనాల మీద అదుపు పెంచుకుంటున్నారు. దీనివల్ల ప్రమాదాల సంఖ్య తగ్గిపోతోందని” హంగరీ దేశానికి చెందిన అధికారులు చెబుతున్నారు. అయితే ఈ వైట్ స్ట్రిప్స్ కు సంగీతం రావడానికి అక్కడి శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అయితే ఈ రోడ్లను చూసేందుకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు వస్తుండడం విశేషం.
In Hungary, there's a musical road that plays a melody as you drive — but only if you're going the right speed. pic.twitter.com/UcbaA7PQwE
— Dudes Posting Their W’s (@DudespostingWs) April 30, 2025