Google Year in Search 2021: మనం ఏ విషయం తెలియాలన్నా ఒకప్పుడు గురువునే అడిగేవారం. కానీ, మారిన పరిస్థితులలో ఆ గురువు పాత్రను గూగుల్ తల్లి పోషిస్తోంది. ప్రతీ ఒక్కరికి గూగుల్ సెర్చ్ ఇంజిన్ గురువులాగా మారింది. ఇక్కడ ఏదేని విషయమై మీరు ప్రశ్న సంధిస్తే చాలు.. సెకన్ల వ్యవధిలోనే ఆన్సర్ వచ్చేస్తుంది. అంతటి కీలక పాత్రను గూగుల్ తల్లి పోషిస్తోంది. ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది ఎవరి కోసం సెర్చ్ చేశారో ఆ వివరాలను గూగుల్ అనౌన్స్ చేసింది.
ఏటా గూగుల్‌లో ఎవరి గురించి ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారనే వివరాలను గూగుల్ ప్రకటిస్తుంటుంది. అలా ఈ ఏడాది మన దేశంలో ఎక్కువ మంది వీరి కోసం వెతికారు. అందులో ఫస్ట్ ప్లేస్ నీరజ్ చోప్రాకు దక్కింది. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా వివరాలను కనుగొనేందుకు ఎక్కువ మంది సెర్చ్ చేశారు. కరోనా మహమ్మారి వలన చాలా మంది దాదాపుగా కొంత కాలం ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే అందరూ దాదాపుగా మూవీస్, న్యూస్, ఈవెంట్స్, ఫుడ్ ఐటమ్స్ మేకింగ్ గురించి సెర్చ్ చేశారు.
కొవిడ్ వల్ల ఇంటర్నెట్ యూసేజ్ కూడా గతంలో కంటే ఎక్కువే పెరిగింది. అలా అంతర్జాలాన్ని ఉపయోగించి దాదాపుగా అందరూ వెతికిన వ్యక్తుల్లో భారత్‌కు స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. వందేళ్ల కలను సాకారం చేసిన నీరజ్ చోప్రా వివరాలు కనుగొనే ప్రయత్నం చేశారు. ఇక ఆ తర్వాత ప్లేస్‌లో బాలీవుడ్ సూపర్ స్టార్, బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఉన్నారు. క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుపోయి జైలు జీవితం గడిన ఆర్యన్ ఖాన్ గురించి కూడా సెర్చ్ చేశారు. ఇటీవల బెయిల్‌పై విడుదలై ఆర్యన్ ఖాన్ ఇంటికొచ్చారు.
Also Read: RRR Trailer : ‘యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలొచ్చాయ్..’ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ బీభత్సం
థర్డ్ ప్లేస్‌లో బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ శిల్పాశెట్టి హస్బెండ్ రాజ్ కుంద్రా ఉన్నారు. పోర్నోగ్రఫి రాకెట్ కేసులో రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేశారు. పెషనాజ్ గిల్ గురించి కూడా వెతికారు. గిల్. ‘బిగ్ బాస్ 13’ సీజన్‌లో కంటెస్టెంట్. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలన్ మస్క్ గురించి కూడా సెర్చ్ చేశారు. బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ గురించి సెర్చ్ చేశారు. విక్కీ కౌశల్ బీ టౌన్ అందాల భామ కత్రినా కైఫ్‌ను మ్యారేజ్ చేసుకోబోతున్నారు. ఈ క్రమంలోనే కత్రిన అభిమానులు, సినీ లవర్స్ విక్కీ కౌశల్ గురించి సెర్ఛ్ చేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన పీవీ సింధు కోసం కూడా గూగుల్ తల్లిని చాలా మంది వెతికారు. సుశీల్ కుమార్, నటాషా దలాల్ గురించి కూడా గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో చాలా మంది వెతికారు.
Also Read: Saiteja: అంచెలంచెలుగా ఎదిగిన సాయితేజ.. ‘రావత్’ను మెప్పించాడు?