Mind-Reading Robot: మనిషి తన మేథోశక్తితో ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కష్టపడకుండా అన్ని పనులు చేసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాడు. మనిషిలో బద్ధకం పెరిగిపోతోంది. దీంతో ఏ చిన్న పని కూడా చేసుకోవడానికి వెనకాడుతున్నాడు. రాబోయే కాలంలో మొత్తం రోబోల కాలమే రానుంది. ప్రతి పని రోబోలే చేయనున్నాయి. మనిషి మెదడును సైతం తెలుసుకుని ఏం కావాలో కూడా చేసేస్తుంది. మనిషి తెలివిని పలు రకాలుగా వాడుతున్నాడు. కొత్తగా తయారు చేసే రోబోలతో మనిషి కలలు నెరవేరనున్నాయి.
రోబో మనిషి మెదడును చదివేస్తుంది. మనిషికి ఏం కావాలో తెలుసుకుంటుంది. దీంతో మన అవసరాలు తీరుస్తుంది. రోబోలో మానవ మెదడు తరంగాలను సూపర్ వైజ్ చేస్తూ కండరాల నుంచి పాసయ్యే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ సేకరిస్తుంది. దీంతో మనిషికి ఏం కావాలో తెలుసుకుని ప్రవర్తిస్తుంది. మనిషి ఏం అడగబోతున్నాడనే విషయం కూడా తెలిసిపోతోంది. మనకు కావాల్సిన వస్తువులు క్షణాల్లో తెచ్చిపెడుతుంది.
స్విట్జర్లాండ్ కు చెందిన శాస్త్రవేత్తలు ఈ మేరకు రోబోలను తయారు చేస్తున్నారు. రోబోల తయారులో ఎన్నో వైవిధ్యాలను చూపిస్తున్నారు. దీంతో భవిష్యత్ లో అధునాతన సాంకేతికతతో ఎన్నో మైలురాళ్ల దాటనున్నారు. రోబోల తయారులో ఇప్పటికే ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేశారు. ఇంకా రోబోల తయారుతో పనులు సులువుగా అయిపోనున్నాయి. మనకు ఏం కావాలో తెలుసుకుని అవి ప్రవర్తించడంతో మనకు పని ఉండదు. వట్టి చేతులతో ఊపుకుంటూ కూర్చోవడమే. దీంతో రోబోల కాలం ముందు రాబోతోంది.
గత ఏడాది దీనికి సంబంధించిన ప్రొటో టైప్ ను కనుగొన్నారు. ఇక రోబోను బయటకు తీసుకురావడమే తరువాయి కార్యక్రమం. దీంతో మనుషుల్లో ఇంకా బద్ధకత్వం ఎక్కువవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మనిషి సాంకేతికతతో ఎన్నో మార్పులు తీసుకొస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోబోల తీరుతో మనుషులకు పని లేకుండా పోతోంది. రోబోలు రావడంతో మనకు లాభాలున్నా వాటిని నియంత్రణ చేయడంలోనే సమస్యలు వస్తాయేమోనని అందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.