Homeవింతలు-విశేషాలుKonark Sun Temple: ఆధారం ఉండదు.. ఈ విగ్రహం గాల్లో తేలుతూ ఉంటుంది.. మనదేశంలో ఇది...

Konark Sun Temple: ఆధారం ఉండదు.. ఈ విగ్రహం గాల్లో తేలుతూ ఉంటుంది.. మనదేశంలో ఇది ఎక్కడ ఉందంటే

Konark Sun Temple: మన దేశం పురాతన సంస్కృతికి పెట్టింది పేరు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ ఆనవాళ్లు కనిపిస్తూనే ఉంటాయి. అవి భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని బయటపెడుతూనే ఉంటాయి. అయితే నేటికీ ఆ నైపుణ్యాలు అంతు చిక్కవు. అటువంటి ఆలయాలు.. నిర్మాణాలు.. కట్టడాలు మనదేశంలో చాలా ఉన్నాయి. ఆలయాల శిల్పకళ గురించి.. కట్టడాల వెనుక ఉన్న అద్భుతం గురించి ఇప్పటివరకు మనం ఏదో ఒక రూపంలో తెలుసుకున్నాం. కానీ ఒక ఆలయం లో ఉన్న విగ్రహం ఎటువంటి ఆధారం లేకుండానే గాలిలో తేలిపోతూ ఉంటుంది. ఇది భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి మచ్చు తులకలాగా నిలుస్తోంది.

విభిన్న సంస్కృతికి పెట్టింది పేరైన ఒడిశా రాష్ట్రంలో కోణార్క్ సూర్య దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో నిర్మించారని చరిత్రకారులు చెబుతుంటారు. కోణార్క్ పేరు చెప్పగానే మనకు సూర్య దేవాలయం గుర్తొస్తుంది. ఈ ఆలయంలో సూర్యుడి విగ్రహం ఎటువంటి ఆధారం లేకుండానే గాలిలో తేలిపోతూ ఉంటుంది. ఇది ఒకప్పుడు మిస్టరీగానే ఉండేది. ఆలయ శిఖరంలోని 52 టన్నుల భారీ అయస్కాంతం.. పునాదిలోని మ్యాగ్నెటిక్ మధ్య ఏర్పడే అయస్కాంత క్షేత్రం వల్ల విగ్రహం గాలిలో నిలబడి ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు.. దీనివల్ల భక్తులకు స్వామివారిని దర్శించుకునే క్రమంలో సరికొత్త అనుభూతి కలుగుతుందని చరిత్రకారులు వివరిస్తున్నారు..

కోణార్క్ ఆలయంలో సూర్య దేవుని విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది. మనదేశంలో ఒడిశా ప్రాంతంలోనే కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరసవిల్లిలో సూర్యుడికి ఆలయం ఉంటుంది.. కోణార్క్ సూర్యదేవాలయంలో, అరసవిల్లి సూర్య దేవాలయంలో రథసప్తమి వేడుకలు ప్రతి ఏడాది ఘనంగా జరుగుతుంటాయి. రథసప్తమి రోజు సూర్యదేవుడికి రకరకాల అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు.. పూజలు జరుపుతుంటారు. అరసవిల్లిలో సూర్యకిరణాలు స్వామివారిని నేరుగా తాకుతుంటాయి. కోణార్క్ సూర్యదేవాలయంలో కూడా ఇదేవిధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ విగ్రహం నిత్యం గాలిలో తేలే అనుభూతి కలిగిస్తుంది కాబట్టి.. సూర్యకిరణాలు ఎక్కడ స్వామివారి మీద ఏటవాలుగా పడిపోతూ ఉంటాయి..

సూర్య దేవాలయాన్ని సందర్శించడానికి ప్రతిఏటా లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. ప్రతి నిర్మాణం సంస్కృతికి నిలువుటద్దంగా నిలుస్తూ ఉంటుంది. అందువల్లే ఈ ఆలయం లో ప్రతి శిల్పం ఒక చరిత్రను చెబుతుందని.. ప్రతి నిర్మాణం సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని చరిత్ర అధ్యయనకారులు వివరిస్తుంటారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version