Khammam Mobile Blast: ఇప్పటి రోజులన్నీ స్మార్ట్ ఫోన్ చుట్టూ తిరుగుతున్నాయి. సోషల్ మీడియా చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఒకప్పుడు స్మార్ట్ ఫోన్లు చాలా ఖరీదుగా ఉండేవి. అనేక కంపెనీలు ఈ విభాగంలోకి ప్రవేశించడంతో స్మార్ట్ ఫోన్ల ధరలు చాలా వరకు తగ్గాయి. ఇక ఇందులో చైనా కంపెనీలు ప్రవేశించడంతో ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. ఎక్కువ సౌలభ్యాలు ఇవ్వడంతో చాలామంది చైనా ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ తక్కువ ధరలో లభిస్తున్న స్మార్ట్ ఫోన్లలో సదుపాయాలు అంతంత మాత్రం గానే ఉంటున్నాయి. పైగా వాటికి చార్జింగ్ పెట్టే సమయంలో జరగరాని దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
Also Read: మీ పిల్లలు మొబైల్ ముట్టకుండా ఏం చేయాలో తెలుసా? వీడియో వైరల్..
ఖమ్మం జిల్లాలో ఓ కంపెనీ మొబైల్ ఫోన్ కు చార్జింగ్ పెట్టగా పేలింది. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మామిళ్ళపల్లి సముదాయం సమీపంలోని ఓ ఇంట్లో ఈ సంఘటన జరిగింది. మొబైల్ ఫోన్ కు చార్జింగ్ పెట్టగా.. ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో ఫోన్ పేలిపోయింది. మంటలు చెలరేగడంతో ఇంట్లో వస్తువులు మొత్తం కాలిపోయాయి. అగ్మాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. దాదాపు పదిలక్షల వరకు ఆస్తి నష్టం చోటు చేసుకున్నదని బాధితులు చెబుతున్నారు. చైనా దేశానికి చెందిన ఓ కంపెనీకి సంబంధించిన మొబైల్ ఫోన్ కొనుగోలు చేశామని.. చార్జింగ్ పెట్టే క్రమంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఈ ఘోరం చోటుచేసుకుందని బాధితులు చెబుతున్నారు.
Also Read: కదిలే శ్మశాన వాటిక.. ఇక ఎక్కడ చచ్చినా నో ప్రాబ్లం..
మనదేశంలో ప్రస్తుతం వాడుతున్న ఫోన్లలో సింహభాగం చైనా కంపెనీలకు సంబంధించినవే. కాకపోతే ఈ కంపెనీలు అత్యంత తక్కువ ధరలో ఫోన్లు అందిస్తుంటాయి. ఈ ఫోన్లలో సౌకర్యాలు అంతంత మాత్రమే ఉంటాయి. చార్జింగ్ పెట్టినప్పుడు తీవ్రస్థాయిలో విద్యుత్ ప్రసారం అవుతుంది. అలా ప్రసారమైన విద్యుత్ ను ఆ ఫోన్లు తట్టుకోలేవు. అప్పుడు అవి పేలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇటీవల కాలంలో ఆ తరహా ఘటనలు విపరీతంగా జరుగుతున్నాయి. అందువల్లే చైనా దేశానికి చెందిన మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ” సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. తక్కువ ధరలో వస్తున్నాయని ఫోన్లు కొనుగోలు చేయకూడదు. ఫీచర్లు పరిశీలించిన తర్వాతే ఫోన్ కొనుగోలు చేయాలి. చౌక ధరలో లభించే ఫోన్లను కొనుగోలు చేస్తే ఇటువంటి ప్రమాదాలే ఎదురవుతాయని” టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.