Made in India: ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట వేదికగా ఇచ్చిన ‘మేడిన్ ఇండియా’ పిలుపు దేశ పౌరులందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. భారతీయ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించాలని, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భారతీయుం.. భారత వస్తువులనే కొందాం అనే నినాదం విస్తృతమవుతోంది. జనంలోకి వెళ్తోంది. పండుగల వేళ.. ఇది శుభ పరిణామమని వివ్లేషకులు పేర్కొంటున్నారు.
రాజ్యాంగం పౌరులకు హక్కులను అందించినట్లే, ప్రాథమిక బాధ్యతలను కూడా నిర్దేశించింది. రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలపై అధికారులను, రాజకీయ నాయకులను తప్పుబట్టడం సర్వసాధారణం. అయితే, దేశ అభివృద్ధిలో పౌరుల బాధ్యత కూడా కీలకమని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ‘మేడిన్ ఇండియా’ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ఉద్యోగ అవకాశాలను సృష్టించడం సాధ్యమవుతుంది. ఈ బాధ్యతను ప్రతి పౌరుడు స్వీకరించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో అనేక రంగాల్లో ఉత్పత్తులను తయారు చేస్తున్న స్థానిక బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. నిత్యావసర వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఔషధాల వరకు వివిధ రకాల ఉత్పత్తులను భారతీయ కంపెనీలు అందిస్తున్నాయి.
భారతీయ ప్రముఖ బ్రాండ్లు ఇవీ..
– నిత్యావసర వస్తువులు: టాటా కన్సూ్యమర్ ప్రొడక్ట్స్, ఆశీర్వాద్, డాబర్, పతంజలి, గోద్రేజ్, ఐటీసీ, ఇమామి, అమూల్, నిర్మ, హమ్‌దార్డ్.
– ఆహారం – పానీయాలు: అమూల్, పార్లే, బ్రిటానియా, హల్దిరామ్స్, క్యాంపా కోలా, బికాజీ, మదర్ డైరీ.
– టెక్స్‌టైల్స్ – దుస్తులు: రేమండ్, అరవింద్, ఫ్యాబ్ ఇండియా, మాన్యవర్, బాంబే డైయింగ్, బిబా.
– ఎలక్ట్రానిక్స్ – ఉపకరణాలు: గోద్రేజ్, వోల్టాస్, బజాజ్, హావెల్స్, మైక్రోమాక్స్, లావా, బోట్, నాయిస్.
– ఆటోమొబైల్స్: టాటా మోటార్స్, మహీంద్రా, హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్‌ఫీల్డ్.
– ఔషధాలు: సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, భారత్ బయోటెక్.
– సాఫ్ట్‌వేర్ – ఐటీ: టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, జోహో.
ఈ బ్రాండ్లు భారతీయ శ్రమ, నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. వస్తువులు కొనుగోలు చేసే ముందు ‘మేడ్ ఇన్ ఇండియా’ లేబుల్‌ను తనిఖీ చేయడం ద్వారా స్థానిక ఉత్పత్తులకు మద్దతు ఇవ్వవచ్చు.
Also Read: శాస్త్రీయ ఆధారాలతో మహాభారత యుద్ధ కాలం తెలిసింది
దేశ ఆర్థిక వ్యవస్థకు బలం..
‘మేడిన్ ఇండియా’ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఈ చర్య దేశంలో డబ్బు రొటేషన్‌ను పెంచుతుంది, ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది, నిరుద్యోగ సమస్యను తగ్గిస్తుంది. స్థానిక ఉత్పత్తులకు డిమాండ్ పెరిగితే, కంపెనీలు ఉత్పత్తిని విస్తరించి, మరిన్ని ఉద్యోగాలను కల్పిస్తాయి. ఇది దేశ జీడీపీని పెంచడమే కాక, రూపాయి విలువను బలోపేతం చేస్తుంది. అదనంగా, దిగుమతులపై ఆధారపడటం తగ్గడం వల్ల విదేశీ మారక నిల్వలు రక్షించబడతాయి. స్థానిక బ్రాండ్లకు మద్దతు ఇవ్వడం వల్ల కంపెనీలు ఆవిష్కరణలు, పరిశోధనలలో ఎక్కువ పెట్టుబడులు పెడతాయి, దీనివల్ల ఉత్పత్తుల నాణ్యత మెరుగవుతుంది. ఇది భారతీయ కంపెనీలను అంతర్జాతీయంగా పోటీపడే స్థాయికి తీసుకెళ్తుంది.
చీప్ చైనా వస్తువులను దూరం పెడదాం..
చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు, ముఖ్యంగా చవకైన ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్, భారతీయ మార్కెట్లో గణనీయమైన స్థానాన్ని ఆక్రమించాయి. ఇవి కొనుగోలు చేయడం వల్ల దేశ ఆర్థిక వనరులు విదేశాలకు వెళ్తాయి, స్థానిక కంపెనీలకు నష్టం కలుగుతుంది. దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దిగుమతి వస్తువులకు బీఐఎస్ ప్రమాణాలను తప్పనిసరి చేస్తోంది. చైనా వస్తువులకు బదులుగా ‘మేడిన్ ఇండియా’ ఉత్పత్తులను ఎంచుకోవడం ద్వారా స్థానిక పరిశ్రమలను రక్షించడమే కాక, దేశ ఆర్థిక స్వావలంబనను పెంపొందించవచ్చు.
‘మేడిన్ ఇండియా’ ఉత్పత్తులను కొనుగోలు చేయడం కేవలం ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును రూపొందించే బాధ్యత. ప్రతీ కొనుగోలు నిర్ణయం దేశంలో ఉపాధి, ఆవిష్కరణ, ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం చూపుతుంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ కొనుగోళ్లలో ‘కంట్రీ ఆఫ్ ఆరిజిన్’ తనిఖీ చేయడం ద్వారా పౌరులు తమ వంతు కషి చేయవచ్చు. ప్రధాని మోదీ ఆశయం సాకారం కావాలంటే, ప్రతి భారతీయుడు ఈ బాధ్యతను స్వీకరించాలి.