దేశీయ టెలీకాం దిగ్గజం జియో కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో ప్లాన్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. జియో యూజర్ల కోసం అద్భుతమైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ రీఛార్జ్ ప్లాన్స్ వల్ల డిస్నీ+ హాట్ స్టార్స్ అన్‌లిమిటెడ్ యాక్సెస్ కూడా ఉంటుంది. వచ్చే నెల 19వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. క్రికెట్ లవర్స్ ఈ ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఉచితంగా లైవ్ లో క్రికెట్ చూడవచ్చు.
జియో 5 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ద్వారా డిస్నీ+ హాట్ స్టార్ కంటెంట్ లైబ్రరీ కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ పొందే అవకాశం కల్పించింది. గతంలో వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ద్వారా లైవ్ స్పోర్ట్స్, హాట్ స్టార్ స్పెషల్స్, సినిమాలు, టీవీ షోలు మాత్రమే చూసే అవకాశం ఉండేది. ప్రస్తుతం రిలయన్స్ జియో కొత్త ప్లాన్ ద్వారా డిస్నీ+ హాట్ స్టార్ డిస్నీ+ ఒరిజినల్స్, డిస్నీ, మార్వెల్, ఇతర కంటెంట్ ను చూసే అవకాశం ఉంటుంది.
కొత్త రీఛార్జ్ ప్లాన్ల విషయానికి వస్తే 28 రోజుల వ్యాలిడిటీతో రూ.499, 56 రోజుల వ్యాలిడిటీతో రూ.666, 84 రోజుల వ్యాలిడిటీతో రూ.888, 2,599 రూపాయలతో 365 రోజుల వ్యాలిడిటీని పొందే అవకాశం ఉంటుంది. 499 రీఛార్జ్ ప్లాన్ కింద రోజుకు 3జీబీ డేటా పొందే అవకాశం ఉండగా మిగిలిన ప్లాన్స్ లో మాత్రం కేవలం 2జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. ఈ ప్లాన్లు రీఛార్జ్ చేసుకోవడం ద్వారా అన్‌లిమిటెడ్ వాయీస్, ఎస్ఎమ్ఎస్ బెనిఫిట్స్ పొందవచ్చు.
అదనంగా 1.5 జీబీ డేటా కావాలని అనుకుంటే డేటా యాడ్-ఆన్ ప్లాన్ రూ.549ను రీఛార్జ్ చేసుకుంటే మంచిది. 56 రోజుల వ్యాలిడిటీతో 549 రూపాయల ప్లాన్ ఉంటుంది.