Japan
Japan: టెక్నాలజీ పెరుగుతున్న కొద్తీ మనిషి పనులు సులభం అవుతున్నాయి. పరిశోధకులు కూడా ఈ దిశగానే పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, బస్టాండ్లలో పైకి ఎక్కడానికి ఎస్కలేటర్లు తయారు చేశారు. ఇప్పుడవి షాపింగ్ మాల్స్, థియేటర్లలోకి వచ్చాయి. ఇక ఎయిర్ పోర్టుల్లో లేజీ మోయడానికి కూలీలు కాకుండా కన్వేయర్ బెల్ట్ ఉపయోగిస్తున్నారు. అయితే ఇది చిన్న దూరానికే పరిమితం. ఒక నగరం నుంచి మరో నగరానికి.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి లగేజీ లగేజీ తీసుకెళ్లే ఆలోచన చేస్తోంది జపాన్. ఆదేశం ఎదుర్కొంటున్న జనాభా తగ్గుదల సమస్య అక్కడి సైంటిస్టులకు ఈ ఆలోచన తెచ్చింది. వచ్చే పదేళ్లలో జనాభా ఇంకా తగ్గితే లగేజీ మోసేవాళ్లు ఉండరని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెక్నాలజీ సాయంతో లగేజీలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించే ప్రాజెక్టు సిద్ధం చేస్తోంది.
ఆటో మేటెడ్ కన్వేయర్ బెల్ట్..
జపాన్ ప్రభుత్వం ప్రధాన నగరాల్లో ఆటోమేటెడ్ జీరో ఎమిషన్స్ లాజిజ్టిక్స్ లింక్‌లను ఏర్పాటు చేయడానికి ఓ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇది అమలులోకి వస్తే ఒక వ్యక్తి లగేజీని ప్రత్యేకంగా తనతోపాటే తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. దీని కోసం ప్రత్యేకంగా కన్వేయర్ బెల్ట్ నిర్మాణాలు అందుబాటులోకి వస్తాయి.
2034 నాటికి అందుబాటులోకి..
మనుషులు అవసరం లేకుండా ఒక నగరం నుంచి లగేజీని మరో నగరానికి తరలించడానికి జపాన్ ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి చర్చలు జరుపుతోంది. 2034 నాటికి దీనిని అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మొదట టోక్యో నుంచి ఒసాకా వరకు ఈలింక్ పూర్తి చేయాలని జపాన్ ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు మధ్యంతర నివేదిక, ముసాయిదాను శుక్రవారం విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు అమలులోకి వచ్చిన తర్వాత లక్షల టన్నుల బరువును కూడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించవచ్చు. టోక్యో–ఒసాకా నగరాల మధ్య 500 కిలోమీటర్ల దూరం ఉంది. దీనిని కవర్ చేయడానికి భారీ కన్వేయర్ బెల్ట్‌లను ఉపయోగించే అవకాశం ఉంది. హైవే పక్కన లేదా రహదారికి దిగువన ఉన్న సొరంగాల గుండా ఇది సాగుతుంది. మొత్తం డ్రైవర్‌లెస్ టెక్నాలజీతో దీనిని రూపొందిస్తారు. ఇందులో కార్గోలు లగేజీని సురక్షితంగా గమ్యానికి చేరుస్తాయి.
కూలీల కొరత అధిగమించేందుకు..
జపాన్‌లో జననాల రేటు తగ్గుతోంది. దీంతో అక్కడ పనిచేసేవారు దొరకం లేదు. రాబోయే పదేళ్లలో ఎవరి పని వాళ్లే చేసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో పనిచేసేవారి కొరతను అధిగమించేందుకు జపాన్ ఈ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే పదేళ్లలో కన్వేయర్ లగేజీ ట్రాన్స్‌పోర్టు అందుబాటులోకి వస్తుంది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Japan ministry of transport has proposed an automated logistics link between tokyo and osaka
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com