IPhone 17 Pro Max: స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ కంపెనీ కొత్త మోడల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (iPhone 17 Pro Max) గురించి ఇప్పటికే పలురకాల వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 2025లో అధికారికంగా విడుదల కానున్నప్పటికీ, దీనికి సంబంధించిన లీక్‌లు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. పర్ఫామెన్స్, డిజైన్, కెమెరా వంటి భారీ అప్‌గ్రేడ్‌లతో ఇది ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్‌లలోకెల్లా పవర్ ఫుల్ ఫోన్ కావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం రాబోయే యాపిల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో టాప్ 5 మార్పులు ఏంటో వివరంగా తెలుసుకుందాం.
కొత్త డిజైన్
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ప్రస్తుత మోడల్ లాగే 6.9-ఇంచుల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే, యాపిల్ ఈసారి అల్యూమినియం-గ్లాస్ హైబ్రిడ్ డిజైన్‌ను ఇంట్రడ్యూస్ చేయవచ్చని లీకులు సూచిస్తున్నాయి. ఈ మార్పు వల్ల ఫోన్ మరింత డ్యూరబుల్ గా తయారవుతుంది, అంతేకాకుండా వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మరింత సమర్థవంతంగా సపోర్ట్ చేస్తుంది. ఫోన్ మందం కూడా 8.725 మి.మీ.కి పెరుగుతుందని తెలుస్తోంది. ఇది లోపల మరింత పెద్ద బ్యాటరీని అమర్చుతున్నారనే దానికి సిగ్నల్ గా తెలుస్తోంది.
Also Read: Iphone : ఐఫోన్ స్క్రీన్ ధరతో కొత్త బైక్ కొనుక్కోవచ్చు.. పగిలితే అంతే!
పర్ఫామెన్స్ లో మార్పులు
పర్ఫామెన్స్ విషయంలో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఏ మాత్రం రాజీ పడదని లీక్‌లు వెల్లడిస్తున్నాయి. ఈ ఫోన్ యాపిల్ సరికొత్త A19 ప్రో చిప్ (A19 Pro chip) తో రానుందని, దీనికి అదనంగా 12GB RAM ఉంటుందని అంచనా. దీనివల్ల ఫోన్ పర్ఫామెన్స్ ఊహించని స్పీడు ఉంటుంది. ముఖ్యంగా, ఎక్కువ యాప్‌లు ఒకేసారి వాడే వారికి, గేమర్‌లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్, యాపిల్ మొట్టమొదటి సొంత వై-ఫై చిప్(Wi-Fi 7 సపోర్ట్‌తో) ఉండడం వల్ల ఫోన్ మరింత పవర్‌ఫుల్ అవుతుంది. వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఫోన్ వేడెక్కకుండా చూస్తుంది.
కెమెరా, బ్యాటరీలో భారీ ఛేంజెస్
కెమెరా అప్‌గ్రేడ్‌లు ఐఫోన్ అభిమానులను ఆకట్టుకుంటాయి. ఈసారి కొత్త 24MP సెల్ఫీ కెమెరా రానుందని, వెనుక వైపు మూడు 48MP లెన్స్‌లు ఉంటాయని తెలుస్తోంది. వీటిలో మెరుగైన పోర్ట్రెయిట్ జూమ్, 8K వీడియో రికార్డింగ్ కెపాసిటీ ఉండనున్నాయి. డ్యూయల్ వీడియో మోడ్, మెకానికల్ అపెర్చర్ వంటి ఫీచర్లు కూడా ఉండవచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇవి ఫోటోగ్రఫీ ఎక్స్ పీరియన్స్ నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్తాయి.
బ్యాటరీ విషయంలో కూడా పెద్ద మార్పులు ఉండవచ్చు. 7.5W రివర్స్ ఛార్జింగ్ , 35W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చని తెలుస్తోంది. రివర్స్ ఛార్జింగ్ అంటే ఐఫోన్ నుంచి ఇతర డివైజ్‌లకు ఛార్జింగ్ చేయగలగడం. ఇది ప్రయాణాల్లో చాలా ఉపయోగపడుతుంది.
Also Read : iPhone : ఐఫోన్ 16 ప్రో మాక్స్ బ్యాటరీ.. పాడైతే కొత్త ఫోన్ కొనేంత ఖర్చు చేయాల్సిందే !
కొత్త కలర్స్
లీక్ అయిన సమాచారం ప్రకారం, కొత్త స్కై బ్లూ కలర్లో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ రానుంది, ఇది M4 మ్యాక్‌బుక్ ఎయిర్ కలర్ నుంచి ఇన్ స్పైర్ అయింది. ఈ కొత్త రంగుతో పాటు, సిల్వర్ (Silver), వైట్ (White), గోల్డ్ (Gold), బ్లాక్ (Black) వంటి ఎలిగెంట్ షేడ్స్‌లో కూడా ఇది అందుబాటులో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
లాంచ్ తేదీ, ధర
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, మిగిలిన ఐఫోన్ 17 లైనప్‌తో పాటు, సెప్టెంబర్ 11 లేదా 13 మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది. భారతదేశంలో ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ ధర సుమారు రూ.1,64,900 ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ధరలు ఆయా ప్రాంతాల పన్నులు బట్టి మారుతూ ఉంటాయి.