Bengaluru: ఉద్యోగం ఇచ్చేవాళ్లు విద్యార్హత(Education Qualification)ను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటారు. చివరకు అంటెండర్ ఉద్యోగమైనా చదువు ఉండాలంటారు. అయితే కొన్ని ఉద్యోగాలకు చదువు అవసరం లేకపోయినా.. కనీస పరిజ్ఞానం కోసం నోటిఫకేషన్ సందర్భగానే విద్యార్హతను పేర్కొంటున్నారు. బెంగళూరు చెందిన ఓ కంపెనీ మాత్రం ఉద్యోగం కావాలంటే ఒకదాంట్లో ఫెయిల్ కావాలంటోంది. ఈమేకు భిన్నమైన రూల్స్ పెట్టింది. మరి ఆ కంపెనీలో జాబ్ ఏంటి.. జాబ్ చేయాలంటే కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏమిటి.. ఎందులో ఫెయిల్ కావాలో తెలుసుకుందాం.
లవ్‌లో ఫెయిల్ కావాలి..
బెంగళూరుకు చెందిన మెంటరింగ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ చీఫ్ డేటింగ్ ఆఫీసర్(COD) కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రేమ, ఆన్‌లైన్ డేటింగ్ వంటి వాటిలో నైపుణ్యం కలిగి ఉండాలని పేర్కొంది. అభ్యర్థి కనీసం ఒక్కసారి అయినా బ్రేకప్(Break Up), రెండు సిట్యుయేషన్స్, మూడు డేట్లు వంటివి ఉండాలని నిబంధన పెట్టింది. ఇలాంటి వారు మాత్రమే ఉద్యోగానికి అర్హులని స్పష్టం చేసింది. అదే విధంగా కొత్త డేటింగ్ నిబంధనలపై పరిజ్ఞానం ఉండాలి. కొత్తవాటిని సృష్టించడానికి కూడా తగిన ధైర్యం ఉండాలి. కనీసం రెండు లేదా మూడు డేటింగ్ యాప్‌లను ప్రయత్నించి ఉండాలి. ఇందులో అనుభవం ఉండాలి. కానీ క్యాట్‌ఫిషింగ్‌కు తావు లేదని స్పష్టం చేసింది. అవసరమైన లవ్ ఇంటెలిజెన్స్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ పేర్కొంది.
ఆ చదువులు అవసరం లేదు..
బెంగళూరు(Bengalur) కంపెనీలో ఉద్యోగం చేయడానికి ఉన్నత చదువులు అవసరం లేదు. ఎంబీఏ, ఎంసీఏ వంటివి చదవాల్సిన అవసరం లేదు. ఉద్యోగానుభవం అంతకంటే అవసరం లేదు.ప్రేమ పిపాసులై, ప్రేమ భాషలో నిష్ణాతులై ఉండాలి. అయతే జీతం గురించిన వివరాలను సంస్థ నోటిఫికేషన్‌లో వెల్లడించలేదు. ఉద్యోగానికి అప్లయ్ చేసుకున్న వక్తికి సంబంధించిన పూర్వ పరాలను కంపెనీ పరిశీలిస్తుంది.