Homeటాప్ స్టోరీస్Skyroot Aerospace: స్కై రూట్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి.. భవిష్యత్తు మొత్తం వీటిదే..

Skyroot Aerospace: స్కై రూట్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి.. భవిష్యత్తు మొత్తం వీటిదే..

Skyroot Aerospace: స్కై రూట్ అంతరిక్ష పరిశోధన లో సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది. తక్కువ, మధ్య స్థాయి బరువున్న ఉపగ్రహాలను ప్రత్యేకమైన రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించి అద్భుతం సృష్టించింది. ప్రైవేట్ రంగంలో ఈ స్థాయి ఘనత అందుకున్న తొలి కంపెనీగా స్కై రూట్ చరిత్ర సృష్టించింది. అయితే ప్రైవేట్ రంగంలో కేవలం స్కై రూట్ మాత్రమే కాదు.. ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి.. ఇంతకీ ఆ కంపెనీల కథ ఏమిటో ఒకసారి తెలుసుకుందామా..

అగ్నికుల్ కాస్మోస్, చెన్నై

ఇది చెన్నైలో పుట్టిన స్టార్టప్ కంపెనీ. ఇది ఐఐటీ మద్రాసులో రూపొందింది. దీనిని శ్రీనాథ్ రవిచంద్రన్.. మోయిన్.. ప్రొఫెసర్ ఎస్ఆర్ చక్రవర్తి ఏర్పాటు చేశారు. ఈ సంస్థ అగ్ని బాణం అనే రాకెట్ రూపొందించింది. రెండు సంవత్సరాల క్రితం దేశంలోనే పూర్తిగా త్రీడీ ప్రింటెడ్ సెమీ క్రయోజనిక్ ఇంజన్ ను ఇది ప్రయోగించింది. ఇస్రో దేనికి సహాయం చేసింది. అదే కాదు శ్రీహరికోటలో సొంతంగా ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ కూడా ఏర్పాటు చేసుకుంది.

కాస్మో సర్వ్ స్పేస్ , హైదరాబాద్

ఇది హైదరాబాదు నగరానికి చెందిన అంకుర సంస్థ. ఇస్రో మాజీ శాస్త్రవేత్త చిరంజీవి ఫణింద్ర దీన్ని స్థాపించారు. ఇది అంతరిక్షంలో వ్యర్ధాలను తొలగిస్తుంది. పనిచేయని ఉపగ్రహాలను కూడా తొలగిస్తుంది. ఇక విక్రం 1 మిషన్లో ఎంబ్రేస్ ను అంతరిక్షానికి ఈ సంస్థనే పంపించింది.

ధ్రువ స్పేస్, హైదరాబాద్

ఇది కూడా హైదరాబాదుకు చెందిన ఒక అంకుర సంస్థ. దీనిని నెక్కంటి సంజయ్.. పెనమాకూరు తేజ.. అభయ్ .. చైతన్య దొర సురపు రెడ్డి ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఉపగ్రహాలను తయారు చేయడంలో తిరుగులేని స్థాయిని అందుకుంది. తయారుచేసిన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు లాంచ్ డీప్లాయర్లు.. గ్రౌండ్ స్టేషన్లను కూడా ఈ సంస్థ అందిస్తూ ఉంటుంది.

పిక్సెల్, బెంగళూరు

బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ ఇది. దీనిని అమిత్ కుమార్.. అహ్మద్ అనే వ్యక్తులు స్థాపించారు. ఇది భూమి పర్యవేక్షణను ఎప్పటికప్పుడు చేపడుతూ ఉంటుంది. అత్యాధునిక ఇమేజింగ్ ఉపగ్రహాల సమూహాన్ని ఇది ఏర్పాటు చేస్తూ ఉంది. Google.. అనేక సంస్థలు ఇందులో పెట్టుబడులు పెట్టాయి. ఈ సంస్థ వృద్ధి కూడా అద్భుతంగా ఉంది.

దేశీయంగా ప్రైవేట్ అంతరిక్ష సంస్థలకు విపరీతంగా అవకాశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేవలం కమ్యూనికేషన్స్ కోసమే వేలాది సంఖ్యలో బ్రాడ్బ్యాండ్ ఉపగ్రహాలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల అమెరికాలోని స్పేస్ ఎక్స్ మీద విపరీతమైన భారం పడుతుంది. మన దేశానికి చెందిన ప్రైవేట్ అంకుర సంస్థలు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. ఇక మన దేశానికి సంబంధించిన డిఫెన్స్ విభాగం కూడా సరిహద్దుల్లో నిఘా.. పట్టిష్టమైన కమ్యూనికేషన్ కోసం సొంత ఉపగ్రహాలను ఏర్పాటు చేసుకుంటున్నది. దీనివల్ల మనదేశంలో ఉన్న రక్షణ ఆర్డర్లు మొత్తం భారీగా ప్రైవేట్ సంస్థలకు లభిస్తాయి అని తెలుస్తోంది. తక్కువ తయారీ కూడా మనదేశంలో అంతరిక్ష రంగానికి అనుకూలంగా మారుతుంది. ఇస్రో కూడా ప్రైవేట్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇస్తోంది.. అందువల్లే మనదేశంలో స్పేస్ అనేది అంకుర సంస్థలకు కల్పతరువుగా మారింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version