Banking helpline numbers: ప్రతి ఒక్కరికి ఏదోరకంగా బ్యాంకుతో పని ఉంటుంది నేటి కాలంలో. అయితే గతంలో కంటే ఇప్పుడు బ్యాంకు వ్యవహారాలు అంతా డిజిటల్ మయం అయిపోయాయి. డబ్బు వేయడానికైనా.. తీయడానికైనా ఒకప్పుడు బ్యాంకుకు తప్పకుండా వెళ్లాల్సి వచ్చేది. ఆ తర్వాత ఏటీఎంలో ద్వారా డబ్బులు డ్రా చేసుకున్నారు. కానీ ఇప్పుడు చేతిలో మొబైల్ ఉంటే చాలు ఎక్కడికైనా డబ్బును పంపించుకోవచ్చు. అయితే ఎంత మనీ ట్రాన్స్ఫర్ కోసం వివిధ రకాల యాప్స్ ఉపయోగపడుతున్నా.. కొన్ని రకాల సేవలు కోసం తప్పకుండా బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఆ సేవల కోసం కూడా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం ఒక నెంబర్ ను వాట్సాప్ లో యాడ్ చేసుకుంటే చాలు.. కూర్చున్న చోటే కావాల్సిన సేవలను పొందవచ్చు. మరి ఆ నెంబర్ ఏంటి? అది ఎలా పనిచేస్తుంది?
టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న కొద్ది కొన్ని పనులు సులభంగా మారిపోతున్నాయి. బ్యాంకుకు సంబంధించి అన్ని వ్యవహారాలు ఆన్లైన్లోనే చేసుకునే సౌకర్యాలు వస్తున్నాయి. మనీ ట్రాన్స్ఫర్ కోసం వివిధ రకాల యాప్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి.. లోన్ వస్తుందా లేదా చెక్ చేసుకోవడానికి.. లోన్ ఎలిజిబిలిటీ ఎంత? అని తెలుసుకోవడానికి.. వంటి సేవలను ఇప్పుడు ఆన్లైన్లోనే పొందవచ్చు. అయితే ఇప్పటివరకు కేవలం ఆయా బ్యాంకు నెట్ బ్యాంకింగ్, లేదా కస్టమర్ కేర్ కు ఫోన్ చేస్తే మాత్రమే వివరాలు చెప్పేవారు. కానీ ఇప్పుడు అంత ప్రయాస కూడా పడకుండా కేవలం మెసేజ్ ద్వారా కావాల్సిన సేవలను పొందవచ్చును. అందుకోసం వాట్సాప్ లో ఆయా బ్యాంకులకు సంబంధించిన మొబైల్ నెంబర్లను సేవ్ చేసుకోవాలి. మరి ఏ బ్యాంకు నెంబరు ఎలా ఉందో? ఇప్పుడు చూద్దాం..
భారతదేశంలో చాలామందికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అకౌంట్ కలిగి ఉంది. ఇలాంటివారు బ్యాంకు సేవలను కేవలం వాట్సాప్ ల ద్వారా త్వరగా పొందాలనుకుంటే 9022690226 అనే నెంబర్ ను సేవ్ చేసుకుంటే ఇందులో ఎలాంటి సేవలు కావాలంటే అలాంటి సేవలను ఆన్లైన్ ద్వారా పొందవచ్చును. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 70700222 22, ఇండియన్ బ్యాంక్ 8754424242, ఐసిఐసిఐ 8640086400, యూనియన్ బ్యాంక్ 96660 6060, యాక్సిస్ బ్యాంక్ 70 36165000 అనే నెంబర్ల ద్వారా సేవలను పొందవచ్చు. ఇప్పటివరకు ఇలాంటి సేవల కోసం విలువైన సమయాన్ని వృధా చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఆన్లైన్లోనే కావాల్సిన సేవలను పొందడం వల్ల సమయం వృధా కాకుండా ఉంటుంది. దీంతో ఈ సమయంలో ఇతర పనులను చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులు రకరకాల పనులతో బిజీగా ఉంటారు. ఇలాంటి వారికి ఈ నెంబర్లు ఎంతగానో ఉపయోగపడతాయి.