https://oktelugu.com/

WhatsApp: స్క్రీన్ షేరింగ్.. వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ గురించి మీకు తెలుసా?

సాధారణంగా వాట్సాప్ లో ఒకరితో ఒకరు వీడియో కాల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కోవిడ్ సమయంలో జూమ్ యాప్ గ్రూప్ వీడియో కాల్ చేసుకునే అవకాశాన్ని తెరపైకి తీసుకొచ్చింది.. అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో జూమ్ యాప్ విశేషమైన ప్రాచుర్యం పొందింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 30, 2024 8:38 am
    WhatsApp
    Follow us on

    WhatsApp: ఒకప్పుడు ల్యాండ్ ఫోన్లు, తర్వాత తరంగ్ ఫోన్లు, కొంతకాలానికి బ్లాక్ అండ్ వైట్ ఫోన్లు.. కొంత సాంకేతికత పెరిగిన తర్వాత కలర్ ఫోన్లు, కెమెరా ఫోన్లు.. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు.. వందల జీబీ మెమరీ, వందల మెగా పిక్సళ్ళ కెమెరాలు, ఇంకా ఎన్నో సదుపాయాలు..అలాంటి సదుపాయాలలో వాట్సాప్ ఒకటి. సమాచారాన్ని చేరవేయడానికి మాత్రమే ఉపయోగించే స్మార్ట్ ఫోన్ రూపురేఖలను ఈ అప్లికేషన్ పూర్తిగా మార్చేసింది. నెట్ కనెక్షన్ ఉంటే చాలు ఆడియో కాలింగ్, వీడియో కాలింగ్, గ్రూప్ కాలింగ్, ఇప్పుడు కొత్తగా మరో సదుపాయం కూడా తీసుకొచ్చింది.

    సాధారణంగా వాట్సాప్ లో ఒకరితో ఒకరు వీడియో కాల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కోవిడ్ సమయంలో జూమ్ యాప్ గ్రూప్ వీడియో కాల్ చేసుకునే అవకాశాన్ని తెరపైకి తీసుకొచ్చింది.. అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో జూమ్ యాప్ విశేషమైన ప్రాచుర్యం పొందింది. మరి దీనిని స్ఫూర్తిగా తీసుకుందో.. మరేమిటో తెలియదు గాని.. గ్రూప్ వీడియో కాల్ సదుపాయాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఇది చాలామందికి నచ్చడంతో జూమ్ యాప్ న కు బై బై చెప్పారు. అనంతరం ఫోటో లు, వీడియో లు ఎంత తక్కువ రిజల్యూషన్ లో తీసినా హెచ్ డీ క్వాలిటీ లో వచ్చే విధంగా వాట్సాప్ మార్పులు చేర్పులు చేసింది.. ఇది కూడా సూపర్ హిట్ కావడంతో వాట్సాప్ తన అప్లికేషన్ లో మరిన్ని మార్పులు చేసింది. ఇందులో భాగంగా స్క్రీన్ షేరింగ్ అనే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

    సాధారణంగా ఒక గ్రూప్ వీడియో కాల్ మాట్లాడుతుంటే.. ఎవరి బ్యాగ్రౌండ్ కలర్ వారికి ఉంటుంది.. అయితే ఒకే వ్యక్తి బ్యాగ్రౌండ్ అందరికీ ఉండాలంటే అది సాధ్యం కాదు. వాట్సాప్ తీసుకొచ్చిన స్క్రీన్ షేరింగ్ ద్వారా అది సాధ్యమవుతుంది.. కేవలం కాల్ చేసి, అందర్నీ కనెక్ట్ చేసిన వ్యక్తి మాత్రమే కాదు.. మిగతా వ్యక్తులకు కూడా స్క్రీన్ షేరింగ్ చేసే సాలభ్యం ఉంటుంది. అంతేకాదు గ్రూప్ వీడియో కాల్ కూడా హెచ్ డీ క్వాలిటితో చేసుకోవచ్చు. అవసరమైతే ఆ వీడియో కాల్ రికార్డు చేసుకోవచ్చు. బ్యాక్ గ్రౌండ్ మాత్రమే కాదు.. వాటికి అందమైన ఎమోజిలు కూడా యాడ్ చేయవచ్చు.. టెస్టింగ్ దశల అనంతరం స్క్రీన్ షేరింగ్ ప్రక్రియ విజయవంతం కావడంతో..వాట్సాప్ యాజమాన్యం దీనిని మంగళవారం అర్ధరాత్రి నుంచి యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకే, గొప్ప అనుభూతి కలిగించేందుకే తాము ఈ సదుపాయాలు తీసుకొస్తున్నామని వాట్సప్ యాజమాన్యం ప్రకటించింది.