WhatsApp: అందుబాటులోకి Meta AI ఫీచర్.. ఇండియన్ వాట్సాప్ యూజర్లకు పండగే పండగ..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగిపోయిన నేపథ్యంలో.. వాట్సప్ కు కూడా దానిని అనుసంధానించింది మెటా కంపెనీ. Meta AI ఫీచర్ ను వాట్సప్ కు అనుసంధానించింది.

Written By: Neelambaram, Updated On : April 15, 2024 10:15 am

How to use Meta AI on WhatsApp

Follow us on

WhatsApp: సందేశాలకు, ఫోటోలకు, వీడియోలకు, ఎమోజిలకు.. ఇలా సమస్తం వాట్సాప్ మయమే.. ఒక చిన్న మెసేజ్ యాప్ లాగా ప్రారంభమైన వాట్సప్.. ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద చాటింగ్ యాప్ లాగా అవతరించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా యూజర్ల అభిరుచికి తగ్గట్టుగా దీనిని మెటా కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఆ ఫీచర్ ఏమిటో తెలుసుకుందామా..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగిపోయిన నేపథ్యంలో.. వాట్సప్ కు కూడా దానిని అనుసంధానించింది మెటా కంపెనీ. Meta AI ఫీచర్ ను వాట్సప్ కు అనుసంధానించింది. ఇది ఇటీవలే ఇండియన్ వాట్సాప్ యూజర్ లకు అందుబాటులోకి వచ్చింది. దీని ప్రకారం ప్రాంప్ట్ అందిస్తే చాలు దానికి తగ్గట్టుగా ఏఐ ఇమేజ్ అందిస్తుంది meta AI feature.. ముందుగా దీనిని ప్రపంచంలోని ఇతర దేశాలలో వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్కడ విజయవంతం కావడంతో.. మనదేశంలో ప్రవేశపెట్టింది.

చాలామంది యూజర్లు ఇప్పటికే ఈ ఫీచర్ అందుకున్నారు. ఈ కొత్త ఫీచర్ తో యూజర్లు తమకు ఇష్టమైన విధంగా రూపొందించుకోవచ్చు. విలువైన సమాచారం కూడా కేవలం వాట్సాప్ లోనే పొందొచ్చు.. ఒకవేళ మీరు ఈ అనుభూతిని పొందాలంటే.. మీ వాట్సాప్ ను ఒకసారి అప్డేట్ చేసుకోవాలి. అనంతరం ఈ ఫీచర్ మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే కింద ఎడమవైపు మూలలో పాప్ ఐకాన్ రూపంలో కనిపిస్తుంది. ఈ ఫీచర్ చాట్ లిస్ట్ లో టాప్ లో మెటా ఏఐ చాట్ బాక్స్ రూపంలో కనిపిస్తుంది. అక్కడ దానికి నచ్చినట్టుగా ప్రాంప్ట్ అందిస్తే దానికి తగ్గట్టుగా క్రియేటివ్ ఏఐ ఇమేజ్ అందిస్తుంది.. కేవలం ఇమేజ్ క్రియేషన్ మాత్రమే కాకుండా ఏఐ యాప్స్ అందిస్తున్న అన్ని ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. చాట్ బాక్స్ టచ్ చేయగానే ట్యాబ్ ఒకటి ఓపెన్ అవుతుంది. దానిపైన నొక్కగానే అనేక ఆప్షన్స్ కనిపిస్తాయి. మీ అవసరం ఆధారంగా నచ్చిన ఆప్షన్ ఉపయోగించవచ్చు. ఇంకా ఎందుకు ఆలస్యం.. వాట్సాప్ లో వచ్చిన ఈ కొత్త ఫీచర్ నేడే ఉపయోగించండి మరి. సరికొత్త సాంకేతిక అనుభవాన్ని ఆస్వాదించండి.