Chirag Antil shot dead in Canada
Canada: అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ విద్యార్థుల హత్యలు, ఆత్మహత్యల పరంపర కొనసాగుతుండగా, మరోవైపు కెనడాలోనూ మరో విషాద ఘటన జరిగింది. కెనడాలోని సౌత్ వాంకోవర్‌కి చెందిన భారతీయ విద్యార్థి తన ఆడి కారులో శవమై కనిపించాడు. గుర్తుతెలియని దుండగులు అతడిపై కాల్పులు జరిపినట్లు వాంకోవర్ పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 12 రాత్రి 11 గంటల సమయంలో తుపాకీ కాల్పుల శబ్దం వచ్చినట్లు ఈస్ట్ 55 అవెన్యూ నుంచి తమకు సమాచారం అందిందని తెలిపారు. బాధితుడు చిరాగ్ అంటిల్(24)గా గుర్తించారు.
కుటుంబ సభ్యులకు సమాచారం..
వాంకోవర్ పోలీసులు ఈ హత్యకు సంబంధించి ఎవరినీ అరెస్ట్ చేయలేదు. అగంతకుల ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అంటిల్ హత్యపై పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు ఘటనకు ముందు చిరాగ్ తనకు ఫోన్ చేశాడని అతని సోదరుడు తెలిపాడు. అతను కారులో ఎటో వెళ్లాడని ఆ సమయంలోనే ఘోరం జరిగిందని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ స్టూడెంట్స్ వింగ్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా చీఫ్ వరుణ చౌదరి సోషల్ మీడియా ఎక్స్ లో విదేశీ వ్యవహారాల మంత్రికి ఈ ఘటనపై పోస్టు చేశారు. బాధిత కుటుంబానికి సాయం చేయాలని కోరారు. ఘటనపై దర్యాప్తు వేగంగా జరిపేలా చూడాలని అభ్యర్థించారు.
విరాళాల సేకరణ..
ఇదిలా ఉండగా చిరాగ్ మృతదేహాన్ని భారత్‌కు తరలిచేందుకు అతని కుటుంబం కౌండ్ ఫండిగ్ ప్లాట్‌ఫాంలో గోఫండ్ ద్వారా డబ్బులు సేకరిస్తుందని స్థానిక మీడియా తెలిపింది. చిరాగ్ యాంటిల్ 2022, సెప్టెంబర్‌లో కెనడా వెళ్లాడు. అతను ఇటీవలే యూనివర్సిటీ కెనడా వెస్ట్‌లో ఎంబీఏ పూర్తి చేసి వర్క్ పర్మిట్ పొందాడని స్థానికులు తెలిపారు.