Whatsapp: వాట్సాప్ లో మెసేజ్ లు డిలీట్ చేశారా.. అయితే ఇది మీకోసమే..

Whatsapp: వాస్తవానికి ఇలాంటి మెసేజ్లను తిరిగి పొందేందుకు గూగుల్ ప్లే స్టోర్ లో థర్డ్ పార్టీ యాప్స్ చాలా ఉన్నాయి. అయితే అవి అంత శ్రేయస్కరం కాదు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 18, 2024 6:20 pm

Have you deleted messages on WhatsApp

Follow us on

Whatsapp: వాట్సాప్.. ఈ మెసేజ్ యాప్ తెలియని వారు, వాడని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ వ్యాప్తంగా మూడు బిలియన్ల యూజర్లతో ఈ మెసేజింగ్ యాప్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు కొత్త ఫీచర్లను అందిస్తూ, సరికొత్త అనుభూతిని కలగజేస్తోంది. మెసేజింగ్ నుంచి అకౌంట్లో డబ్బులు వేయడం వరకు ప్రతి పని ఈ వాట్సాప్ ద్వారానే జరుగుతోందంటే ఆశ్చర్యం అనిపించకమానదు. అయితే ఈ యాప్ లో మెసేజ్ పంపడమే కాదు, దాన్ని శాశ్వతంగా డిలీట్ చేసే అవకాశం కూడా ఉంది.. అయితే కొన్నిసార్లు అనుకోకుండా మెసేజ్ డిలీట్ చేస్తే.. దాన్ని రిట్రైవ్ చేయడం అంత ఈజీ కాదు. అయితే ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభించింది. పర్మినెంట్ గా డిలీట్ చేసిన మెసేజ్ ఎలా రిట్రైవ్ చేయాలంటే..

వాస్తవానికి ఇలాంటి మెసేజ్లను తిరిగి పొందేందుకు గూగుల్ ప్లే స్టోర్ లో థర్డ్ పార్టీ యాప్స్ చాలా ఉన్నాయి. అయితే అవి అంత శ్రేయస్కరం కాదు. అలాంటి యాప్స్ లో ప్రమాదకర వైరస్, మాల్ వేర్ ఉండే ప్రమాదం ఉంది. ఒక్కసారి వాటిని ఇన్ స్టాల్ చేసుకుంటే దొంగలకు తాళం చెవులు ఇచ్చినట్టే. అలాంటప్పుడు వాటిని ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఇన్ స్టాల్ అసలు చేసుకోకూడదు.. అలాంటప్పుడు డిలీట్ చేసిన మెసేజెస్ ఎలా పొందడం? అనేదే కదా మీ డౌటు? అలాంటి వాటికోసం ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తే సరిపోతుంది. సెట్టింగ్స్ మార్పు చేసుకుంటే చాలు.. డిలీట్ అయిన మెసేజెస్ కూడా దర్జాగా పొందొచ్చు. హాయిగా చదువుకోవచ్చు.

చాలామంది Android ఫోన్ లు వాడుతుంటారు. అయితే అందులో ఉన్న ఇన్ బిల్ట్ ఫీచర్ల గురించి వారికి తెలియదు. దీనివల్ల తొలగించిన మెసేజ్ కూడా తిరిగి పొందవచ్చు. ముందుగా ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. ఆ తర్వాత నోటిఫికేషన్ లపై నొక్కాలి. దాని తర్వాత మరిన్ని సెట్టింగ్స్(more settings) లోకి వెళ్లాలి. ఆ తర్వాత notification history ని నొక్కాలి. ఆ తర్వాత స్క్రీన్ పై కనిపించే టోగుల్ ఆన్ చేయాలి. దాన్ని ఆన్ చేసిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ ద్వారా.. notification history లోకి వెళ్లాలి. ఆ తర్వాత 24 గంటల అనంతరం డిలీట్ అయిన టెక్స్ ట్ మెసేజ్ చూసే అవకాశం లభిస్తుంది. చాలామంది కి ట్రిక్ తెలియక మెసేజెస్ డిలీట్ అయ్యాయని బాధపడుతుంటారు. అందువల్ల ఇకనుంచి ఆ ఇబ్బంది లేకుండా.. ఇలా చేస్తే సరిపోతుంది.