Harvard University
Harvard University: దేవుడున్నాడు అని కొందరు.. లేడని మరికొందరు.. ఇలా శతాబ్దాలుగా వాదనలు జరుగుతూనే ఉన్నాయి. ని కొలస్ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రకటించినప్పుడు.. చాలామంది అతడిని వెర్రివాడిగా చూశారు.. దేవుడు మాత్రమే ఈ విశ్వానికి వెలుగునిస్తున్నాడని అతడిని దూషించారు. ఆ తర్వాత అతడు చెప్పిందే నిజమని నమ్మారు.
నికోలస్ కోపర్నికస్ సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తర్వాత కూడా దేవుడున్నాడు, దేవుడు లేడు అనే ప్రశ్నలకు సమాధానాలు లభించలేదు. అయితే ఇప్పుడు దేవుడికి సంబంధించిన ఒక కీలకమైన పరిశోధనను హార్వర్డ్ యూనివర్సిటీ బయటపెట్టింది. హార్బర్ యూనివర్సిటీలో ఖగోళ, భౌతిక శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ విల్లి సూన్ దేవుడికి సంబంధించిన ఒక కీలకమైన విషయాన్ని వెల్లడించారు. ఆయన ఇటీవల టకర్ కార్ల్ సన్ నెట్వర్క్ తో మాట్లాడారు. దేవుడు ఉన్నాడు అని చెప్పే విషయాన్ని గణిత సూత్రం బయట పెట్టగలదని పేర్కొన్నారు. సాధారణంగా మత విశ్వాసాలకు వ్యతిరేకంగా సైన్స్ కనిపిస్తూ ఉంటుంది. కానీ గణితం మాత్రం దేవుడు ఉన్నాడని నిరూపిస్తుందని హార్వర్డ్ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ” విశ్వం ఏర్పాటు ఒక లక్ష్యం ప్రకారం జరిగింది. యాంటీ మ్యాటర్ (వ్యతిరేక పదార్థం) కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది. జీవం మనుగడ సాగించడానికి అనుగుణంగా విశ్వాన్ని రూపొందించారు. ఇలాంటి మ్యాటర్ ఉనికి, దాని నిష్పత్తి కూడా ఇదే విధానాన్ని సూచిస్తోంది.. మహా విస్ఫోటనం జరిగినప్పుడు అనుకూల పదార్థం, వ్యతిరేక పదార్థం ఏర్పడ్డాయి. అనుకూల పదార్ధం కంటే వ్యతిరేక పదార్థం తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ.. అది జీవం పుట్టుకకు కారణమైనది. అనుకూల పదార్థం, వ్యతిరేక పదార్థం ఆవేశాలు విరుద్ధంగా ఉంటాయి.. ఇవి రెండు సమాన మోతాదుల్లో లేకపోవడం వల్లే జీవం పుట్టుక ఏర్పడింది. ఒకవేళ ఇవి రెండూ కనుక సమానంగా ఉంటే ఒక దానిని ఒకటి నాశనం చేసుకునేవని” ఫార్వర్డ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వ్యతిరేక పదార్ధాన్ని అప్పుడు కనుగొన్నారు
మహా విస్పోటనం సమయంలో ఏర్పడిన వ్యతిరేక పదార్థ ఉనికిని 1932లో శాస్త్రవేత్తల నిర్ధారించారు. అయితే దానికంటే ముందు కేం బ్రిడ్జి విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ పాల్ డిరాక్ దానికంటే ముందే ఆయన గుర్తించారు. డిరాక్ ఫాదర్ ఆఫ్ యాంటీ మ్యాటర్ గా పేరుపొందారు. అయితే ఆయన పరిశోధనలో కొన్ని రేణువులు కాంతి కంటే ఎక్కువ వేగంతో కలడాన్ని గుర్తించారు. దానికోసం అతడు ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతాన్ని ఉపయోగించారు.. ఆ తర్వాత డి రాక్ రుణావేశం ఉన్న మరో రకం ఎలక్ట్రాన్ ను తన ప్రయోగానికి అదనంగా జోడించారు. అయితే ఆ ప్రయోగంలో విచిత్రమైన ఫలితాలు రావడం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచింది. దీంతో డిరాక్ తాను అన్వేషిస్తుంది నిజమేనని భావించారు. ఆ తర్వాత దాని యాంటి మ్యాటర్ గా పేర్కొన్నారు. ఆ తర్వాత శాస్త్రవేత్తలు తమ ప్రయోగాలలో యాంటి మ్యాటర్ ఉందని గుర్తించారు. గురుత్వాకర్షణ బలం, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్ల ద్రవ్యరాశి నిష్పత్తి.. వంటివి విశ్వంతో ముడిపడి ఉన్న స్థిరాంశాలుగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఏదో బలమైన శక్తి వీటికోసం పనిచేస్తుందని.. దానిని దేవుడనే భావనను కొట్టి పారేయలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు.. గురుత్వాకర్షణ శక్తి సమానస్థితిలో ఉండడం.. ఒకవేళ అది గనుక బలహీనంగా ఉంటే నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, గ్రహాల ఏర్పాటు సాధ్యమయ్యేది కాదు. ఒకవేళ అవి ఇంకా బలాన్ని సమకూర్చుకుంటే కృష్ణ బిలంలో విశ్వం అనేది కుప్పకూలిపోయేది. ప్రోటాన్ – ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి నిష్పత్తి తేడాగా ఉంటే డిఎన్ఏ అనే సంక్లిష్ట అణువులు ఏర్పడేవి కావు. విశ్వంలో వేగం, నెమ్మదితనం సమానంగా ఉన్నాయి కాబట్టే కుప్పకూలిపోవడం వంటి ఘటన చోటు చేసుకోలేదు. ఇవన్నీ కూడా దైవం అనే భావనకు బలం చేకూర్చుతున్నాయని హార్వర్డ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.