Google Tricks: గూగుల్‌లో ఇవి సెర్చ్‌ చేస్తే షాక్‌ అవుతారు!!

గూగుల్‌లో మీరు గూగుల్‌ గ్రావీటి అని సెర్చ్‌ చేయగానే ఒక వెబ్‌సైట్‌ వస్తుంది. దానిని ఓపెన్‌ చేయండి. ఇప్పుడు మీరు పేజీపై ఎక్కడ క్లిక్‌ చేసినా మొత్తం పేజీలో కనిపించేవన్నీ కిందపడిపోతాయి.

Written By: Raj Shekar, Updated On : January 16, 2024 5:54 pm

Google Tricks

Follow us on

Google Tricks: గూగుల్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చింగ్‌ వెబ్‌సైట్‌. ఇందులో మనకు ఏం కావాలన్న వెతుక్కోవచ్చు. అందుబాటులో ఉన్న సమాచారం అంతా క్షణాల్లో మీ ముందు పెడుతుంది. నెటిజన్ల అభిరుచికి అనుగుణంగా గూగుల్‌ అప్‌డేట్‌ అవుతూ వస్తోంది. ఇప్పుడు వాయిస్‌ ద్వారా కూడా మనం అడిగిన సమాచారం ఇస్తుంది. అయితే.. ఈ రెండు అంశాలను చాలా మంది సెర్చ్‌ చేసి ఉండరు. అవి సెర్చ్‌ చేస్తే మీరు షాక్‌ అవడం ఖాయం అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌ గ్రావిటీ..
గూగుల్‌లో మీరు గూగుల్‌ గ్రావీటి అని సెర్చ్‌ చేయగానే ఒక వెబ్‌సైట్‌ వస్తుంది. దానిని ఓపెన్‌ చేయండి. ఇప్పుడు మీరు పేజీపై ఎక్కడ క్లిక్‌ చేసినా మొత్తం పేజీలో కనిపించేవన్నీ కిందపడిపోతాయి. దేన్నైనా వేలితో పైకి అంటే అది పైకి ఎగిరి గ్రావిటీ కారణంగా మళ్లీ కిందపడిపోతుంది. మీరూ ఒకసారి ట్రై చేయండి క్రేజీగా అనిపిస్తుంది.

స్కేల్‌ ఆఫ్‌ ది యూనివర్సిటీ..
ఇక రెండో షాకింగ్‌ సెర్చ్‌ ఏమిటంటే స్కేల్‌ ఆఫ్‌ ది యూనివర్సిటీ. గూగుల్‌లో స్కేల్‌ ఆఫ్‌ ది యూనివర్సిటీ అని టైప్‌ చేసి ఫస్ట్‌ వచ్చిన వెబ్‌సైట్‌ను క్లిక్‌ చేయండి. ఇది ఇంకా క్రేజీగా ఉంటుంది. ఈ అనంతకోటి విశ్వంలో అన్నింటికన్నా చిన్న దానిని నుంచి అన్నింటికన్నా పెద్దదాని వరకు సైజు, పరిమాణం మనకు డిస్‌ప్లే అవుతుంది. అతిచిన్న ఎలక్ట్రాన్‌ నుంచి గెలాక్సీలో ఉండే నెబ్యులాల సైజ్‌ వరకు మనకు కనిపిస్తాయి.

ఈ రెండు ఒకసారి సెర్చ్‌ చేసి చూడండి. బలే థ్రిల్లింగ్‌గా, ఇన్‌ఫర్మేటివ్‌గా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. పదే పదే సెర్చ్‌ చేస్తూ ఉంటారు.