Google Photos: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఎప్పుడు కానీ అందరూ వెళ్లిన దారిలో వెళ్లదు. దానికంటూ ఒక స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ లోనే వెళ్తూ ఉంటుంది. ఒకప్పుడు ఇదంతా చెల్లుబాటయింది. ప్రపంచం మొత్తం గూగుల్ కు సలాం చేసింది. కానీ ఎప్పుడైతే ఓపెన్ ఏఐ కృతిమ మేధ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసిందో.. అప్పటినుంచి గూగుల్ కూడా మారక తప్పలేదు. అలానే మడికట్టుకుని కూర్చుంటే ముప్పు తప్పదని భావించిన గూగుల్.. దానికి తగ్గట్టుగా ఇప్పుడు అడుగులు వేస్తోంది. అడుగులు మాత్రమే కాదు ఏకంగా వందల కోట్ల పెట్టుబడి పెడుతోంది. కృత్రిమ మేధ ద్వారా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తన యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది.
Also Read: పులివెందుల్లో ఓటమి అంచుల్లో వైఎస్.. చంద్రబాబు రంగంలోకి దిగారు.. ఆ తర్వాత ఏమైందంటే?
ఇప్పటికే జెమిని ద్వారా కృత్రిమ మేధలో సరికొత్త సాంకేతిక విప్లవానికి టెక్ దిగ్గజం తెరతీసింది. సంప్రదాయ విధానాలను వద్దనుకొని.. కొత్త కొత్త ప్రయోజనాలవైపు అడుగులు వేస్తోంది. అందువల్లే తను వేసే ప్రతి అడుగును అత్యంత భారీగా వేస్తోంది.. ఇందులో భాగంగానే తన ఫొటోస్ యాప్ లో సరికొత్తగా రీమిక్స్ అనే కృత్రిమ మేధ ఫీచర్ ను అందుబాటులో తీసుకొచ్చింది. భవిష్యత్తు కాలంలో మరిన్ని సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్ చెబుతోంది. ఈ ప్రయోజనం ద్వారా యూజర్లు తమ దృశ్యాలను కేవలం కొన్ని టాప్స్ లతోనే కార్టూన్ ఆర్ట్ స్టైల్స్ లేదా ఆరు సెకండ్ల నిడివి ఉన్న వీడియో క్లిప్ లు గా మార్చుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ సదుపాయం అమెరికాలో ఆండ్రాయిడ్, ఆపిల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని టెక్ దిగ్గజం తెలిపింది.
ప్రయోగదశ విజయవంతం కావడంతో ప్రపంచంలోనే మిగతా దేశాలకు కూడా వర్తింపజేస్తామని టెక్ దిగ్గజం ప్రకటించింది.. అమెరికా తర్వాత వెంటనే ఇండియాలోని యూజర్లకు ఈ ప్రయోజనాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్ ప్రకటించింది. అంతేకాదు కృత్రిమ మేథ ద్వారా టెక్ దిగ్గజం రూపొందించిన ఫొటోస్ లో మరిన్ని ప్రయోజనాలు జత చేస్తామని.. యూజర్లకు అద్భుతమైన అనుభవాన్ని అందుబాటులోకి తెస్తామని ఆ సంస్థ చెబుతోంది. టెక్ దిగ్గజానికి అమెరికాకు మించిన మార్కెట్ ఇండియాలో ఉంది. అందువల్లే తను తయారు చేసిన ప్రతి ఉత్పత్తిని అమెరికా తర్వాత ఇండియాలోనే ప్రవేశపెడుతోంది. కొన్ని సందర్భాలలో కొన్ని ఉత్పత్తులు విఫలమైతున్నప్పటికీ వాటి ద్వారా టెక్ దిగ్గజం కొత్త పాఠాలు నేర్చుకుంటున్నది. అంతేకాదు వాటిలో విప్లవాత్మక మార్పులు చేస్తూ యూజర్లకు అద్భుతమైన సాంకేతిక అనుభవాన్ని అందించడానికి టెక్ దిగ్గజం తాపత్రయపడుతోంది.