Pawan Kalyan OG Dubbing Work: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్… కెరియర్ స్టార్టింగ్ లో ఆయన మంచి సినిమాలను చేసి చాలా తక్కువ సమయంలోనే పవర్ స్టార్ గా చాలా గొప్ప ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. చిరంజీవి తమ్ముడి గా వచ్చినప్పటికి తనకంటూ ఒక ఓన్ స్టైల్ ను ఏర్పాటు చేసుకొని తనకంటు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ను నిర్మించున్నాడు. ప్రస్తుతం చిరంజీవిని మించిన అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా పాలిటిక్స్ లో కూడా తన సత్తా చాటుతున్నాడు. ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ సమయం దొరికిన ప్రతిసారి తన ప్రేక్షకులను అలరించడానికి కొన్ని సినిమాలైతే చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సంవత్సరం హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆ సినిమాతో ఏ మాత్రం తన సత్తాను చాటుకోలేకపోయాడు. ఇక మరోసారి సెప్టెంబర్ 25వ తేదీన ఓజి సినిమాతో యావత్ సినిమా ప్రేక్షకులందరిని అలరించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు…ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా నడుస్తున్నాయి. ఇక ఇలాంటి సందర్భంలోనే పవన్ కళ్యాణ్ సైతం తన పాత్రకి డబ్బింగ్ చెబుతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: పులివెందుల్లో ఓటమి అంచుల్లో వైఎస్.. చంద్రబాబు రంగంలోకి దిగారు.. ఆ తర్వాత ఏమైందంటే?
తన డబ్బింగ్ మొత్తాన్ని పూర్తిచేసి హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ ను కూడా కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. ఇక ప్రస్తుతం సినీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె తాత్కాలికంగా కొనసాగుతున్నప్పటికి ఆ సమ్మె విరమించిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
ఇక ఆలోపు ఓజీ సినిమా డబ్బింగ్ పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…ఇక ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఓజీ సినిమాతో తన అభిమానులు తన నుంచి ఎలాంటి సినిమానైతే ఎక్స్ పెక్ట్ స్తున్నారో అలాంటి ఒక అద్భుతమైన సినిమాని ప్రేక్షకులకు అందించడానికి ఆయన సిద్ధమయ్యారట.
మరి ఈ సినిమాతో పాన్ ఇండియాలో భారీ గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను కూడా తెచ్చుకుంటాడు అంటూ అతని అభిమానులు అలాగే ఓజీ సినిమా మేకర్స్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు… చూడాలి మరి పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాగా ఈ మూవీ నిలుస్తుందా లేదా అనేది…